Type Here to Get Search Results !

Sports Ad

పసిడి ప్రియులకు షాక్ భారీగా పెరిగిన బంగారు ధరలు A Shock To The Green Lovers Is The Huge Rise In Gold Prices

పసిడి ప్రియులకు షాక్ భారీగా పెరిగిన బంగారు ధరలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం ( నవంబర్ 20) నాడు ఒక్కసారిగా పెరిగాయి. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.700 పెరిగింది. దీంతో ధర 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71వేల 150కి చేరింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర కూడా 7760 రూపాయలు పెరిగింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 77వేల 620కి చేరింది. వెండి ధర రూ.లక్షా01వెయ్యికి చేరింది. 

 అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80వేల కు వరకు వెళ్లింది. సుమారు రూ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 70వేలవరకు వెళ్లింది. క్రమంగా ఈ వారంలో బంగారం తగ్గుతూ వచ్చాయి.  

 బంగారం ధరలు ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు ముగుస్తాయి. ప్రతిక్షణం ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాల్సి ఉంటుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies