విద్యార్థులు మీకే అలర్ట్ ‘వేట్టయాన్’ స్టోరీ లాంటి రియల్ కోచింగ్ స్కామ్
జాతీయ National News భారత్ ప్రతినిధి : చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తారనే ఓ పాయింట్ క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని విద్యాసంస్థలు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన రజినీకాంత్ వేట్టయాన్ మూవీ కూడా ఇదే తరహా స్టోరీ. ఆన్ లైన్ కోచింగ్ అని చెప్పి భారీగా డబ్బులు కట్టించుకొని అంత డబ్బులు కట్టే స్తోమతలేని వారితో లోన్ తీయించి మరీ కోచింగ్ ఊబిలోకి లాగుతున్నారు. లక్షల్లో ఫీజు ఒత్తిడి చదువులు, ప్రాక్టికల్ లేని థియరీ క్లాసులు ఫలితంగా విద్యార్థుల ఆత్మహత్యలు. వీటిని చక్కగా విరిస్తూ డైరెక్టర్ జ్ఞానవేల్ వేట్టయాన్ సినిమా తీశారు.
మహారాష్ట్రలోని థానేలో ఇలాంటి కోచింగ్ ఫ్రాడ్ ఒకటి బయట పడింది. 19ఏళ్ల విద్యార్థి ఓ విద్యాసంస్థలో ఫిజియోథెరపీ కోర్సులో చేరాడు. అయితే ఆ సంస్థ ఆమెకు తెలియకుండా ఓ ఫైనాన్స్ కంపెనీ సదరు విద్యార్థి పేరు మీద రూ.4 లక్షల రుణం తీసుకుంది. తర్వాత ఆ ఇన్‌స్టిట్యూట్ సిక్కింకు చెందిన మరో సంస్థ ద్వారా కోర్సును ఏర్పాటు చేసింది. వాళ్లు ఆ అభ్యర్థి నుంచి ఫీజుగా రూ.88వేలు వసూలు చేశారు. తాను మోసపోయానని గ్రహించిన విద్యార్థిని బుధవారం నౌపడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఒక విద్యా సంస్థ, ఫైనాన్స్ కంపెనీపై కేసు ఫైల్ చేసినట్లు థానే పోలీసులు అక్టోబర్ 31న తెలిపారు. 2024 మే-, అక్టోబర్ టైంలో డబ్బు పోగొట్టుకున్నట్లు విద్యార్థి ఫిర్యాదులో పేర్కొన్నాడు.