Type Here to Get Search Results !

Sports Ad

TGPSC కొత్త చైర్మన్‍గా బుర్రా వెంకటేశం Burra Venkatesham As The New Chairman Of TGPSC

TGPSC కొత్త చైర్మన్‍గా బుర్రా వెంకటేశం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా టీ సర్కార్ బుర్రా వెంకటేశంను నియమించింది. 2024 డిసెంబర్ 2 వరకు TGPSC చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. డిసెంబర్ 2తో ఆయన పదవి గడువు ముగియనుంది. దీంతో తదనంతరం తెలంగాణ ప్రభుత్వం TGPSC చైర్మన్ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంకు అప్పగించనుంది. డిసెంబర్ 2న బుర్రా వెంకటేశం బాధత్యలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం బుర్రా వెంకటేశం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బీఎస్జీ) చీఫ్​కమిషనర్​గా ఉన్నారు.

 రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశంను నియమించారు. ఈ క్రమంలోనే ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీగా ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు. గతంలో ఆయన కాలేజీ విద్యాశాఖ కమిషనర్​ గా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్​గా అడిషనల్ బాధ్యతలతో పాటు తెలంగాణ యూనివర్సిటీకి ఇన్ చార్జ్ వీసీగా కూడా పని చేశారు. తర్వాత గవర్నర్  ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies