చలికాలంలో పిల్లల కోసం ఈ జాగ్రత్తలు
Health News భారత్ ప్రతినిధి : ప్రస్తుతం చలికాలం వచ్చేసింది. చిన్న పిల్లల శరీరం పెద్దవారికంటే భిన్నంగా ఉంటుంది. వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెద్దలంటే ఏదొకటి చేసి ఈ పరిస్థితులకు అలవాటు పడుతూ ఉంటారు. కానీ పిల్లల చలిని తట్టుకోలేరు వామ్మో పిల్లలున్న వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడసలే చలికాలం కూడా మొదలైపోయింది. ఈ సమయంలో జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. వింటర్ లో పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో తెలుసుకుందాం.
ఆరోగ్యం...
పిల్లలకు రెగ్యూలర్‌గా వ్యాక్సిన్స్ వేయించాలి. ఎందుకంటే చలికాలంలో వివిధ రకాలు వ్యాధులు, వైరస్లు ఎటాక్ చేస్తుంటాయి. వ్యాక్సిన్స్‌తో కొన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే పిల్లలను, వారు ఉండే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు ఉండవు. జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలి. వైద్యుల సహాయం త్వరగా తీసుకుంటే మంచిది. లేదంటే జలుబుతో ముక్కుపట్టేసి వారు ఇబ్బంది పడొచ్చు.
స్కిన్ కేర్...
పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చలికాలంలో చర్మం బాగా డ్రై అవుతుంది. అందుకే వారికి రెగ్యూలర్‌గా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. లేదంటే డ్రై స్కిన్ చర్మంపై ఇరిటేషన్ రప్పిస్తుంది. బేబి ఫ్రెండ్లీ సన్‌స్క్రీన్స్ రాయొచ్చు. మైల్డ్ సువాసనను ఇచ్చే క్లెన్సర్స్ ఉపయోగించవచ్చు. వీటివల్ల బేబి స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది.
నిద్ర సమయం...
పిల్లలకు ఎప్పుడు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. అలాగే వారు బాడీ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఉండేలా చూసుకుంటే మంచిది. మంచి పరుపు కూడా మంచి నిద్రను అందిస్తుంది. వారికి ఇతర ఇబ్బందులు రాకుండా హెల్ప్ చేస్తుంది. చలి ఎక్కువగా ఉందని బాగా వేడి చేసిన వస్తువులు నీళ్లు ఇవ్వకూడదని గుర్తించుకోవాలి.
ఎలాంటి ఫుడ్ పెట్టాలి...
చలికాలంలో పిల్లలకు ఎక్కువ ఫ్లూయిడ్స్ అందించాలి. గోరువెచ్చని లేదా నార్మల్ నీటిని వారికి అందించాలి. అలాగే ఫార్మూల మిల్క్ లేదా బ్రెస్ట్ ఫీడ్‌ని రెగ్యూలర్‌గా ఇవ్వాలి. చల్లని పదార్థాలు, చల్లని ఆహారాలు అందించకపోవడమే మంచిది.
డ్రెస్సింగ్ స్టైల్...
పిల్లలకు స్వెట్టర్లు లాంటివి వేసేయకుండా.. తేలికైన డ్రెస్‌లను లేయర్లుగా వేయాలి. దీనివల్ల వారికి ఇరిటేషన్‌గా ఉండదు. పైగా వారికి కంఫర్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. బ్రీత్బుల్, మాయిశ్చర్ కలిగిన దుస్తులు వేయాలి. తలకు టోపి లేదా స్కార్ఫ్‌లు కట్టాలి. బయటకు వెళ్లేటప్పుడు వీటిని కచ్చితంగా తీసుకువెళ్లాలి.
పిల్లలకు కలిగే ఇబ్బందులు...
చలి వల్ల పిల్లల్లో రెస్పిరేటరీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇన్ఫ్లూయేన్జా, హైపోథెర్మియా, డీహైడ్రేషన్, స్కిన్ సమస్యలు పిల్లలకు ఎక్కువగా వస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం కూడా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
చిన్నపిల్లలను తీసుకుని బయటకు వెళ్లేప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. చలి బాగా ఎక్కువగా ఉంటే పిల్లలను బయటకు తీసుకువెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్తే వారిని ఫుల్‌గా కవర్ చేసి తీసుకెళ్లండి. అలాగే సన్‌స్క్రీన్, లిప్‌బామ్‌ని అప్లై చేయండి. డైపర్స్, పాలు, మందులను మీ వెంట తీసుకెళ్లండి. అలాగే ఎక్స్ట్రా డ్రెస్‌లను కూడా తీసుకువెళ్తే మంచిది. తలను మాత్రం కచ్చితంగా కవర్ చేయాలి.