ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వాళ్లకు ఈ విషయం తెలుసో లేదో
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ కార్డ్ అనే కొత్త ఫీచర్ వచ్చింది. ఈ కార్డ్ ఎందుకు ఎలా పనిచేస్తుంది అంటే ఈ కార్డ్ ద్వారా మీ ప్రొఫైల్ ఎక్కువ మందితో షేర్ చేసుకోవచ్చు. మామూలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే పేరుతో చాలాసార్లు వేర్వేరు ప్రొఫైల్స్ క్రియేట్ అవుతుంటాయి. ఈ కార్డ్ ద్వారా ఫాలోవర్లు మిమ్మల్ని మాత్రమే ఫాలో అయ్యేందుకు వీలుంటుంది. ఈ ప్రొఫైల్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా డైరెక్ట్‌గా ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫాలో అయిపోవచ్చు. ఇది చూడడానికి డిజిటల్ కార్డ్‌లా ఉంటుంది.
అందులో బయోడేటా, ఇతర పేజీల లింక్‌లు, మీ ఫేవరేట్ సాంగ్ వంటి వాటిని పెట్టుకోవచ్చు. అంతేకాదు మీ కార్డ్‌ని కస్టమైజ్ చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కూడా మార్చొచ్చు. సెల్ఫీలను అప్లోడ్ చేయొచ్చు. కస్టమైజ్డ్ ఎమోజీలను కూడా యాడ్ చేయొచ్చు. ప్రొఫైల్ కార్డ్‌ను షేర్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులో షేర్ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేసి ప్రొఫైల్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అవసరమైన వివరాలను ఎడిట్ చేయొచ్చు కూడా. తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కార్డ్‌ని స్టోరీలో షేర్ చేయొచ్చు. ఇతర సోషల్ నెట్‌వర్క్‌లలో కూడా షేర్ చేయొచ్చు. కావాలంటే దీన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ చేయొచ్చు. దీంతో ఫాలోవర్లు పెరిగే ఛాన్స్ ఉంది.