పుష్ప 2 ఫస్ట్ డే నెట్ కలెక్షన్స్ ఎంతంటే బాలీవుడ్‌లో బలంగా జెండా పాతేసిన ఐకాన్
Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) వరల్డ్ వైడ్గా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతవరకు రాబట్టింది? ట్రేడ్ వర్గాల అంచనాలు ఏ మేరకు అందుకుంది? అనే వివరాలు చూద్దాం.
తొలిరోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో తెలుగు రాష్టాలలో రూ.95.1 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. హిందీ వెర్షన్ రూ.67 కోట్ల రూపాయల వసూళ్లతో గణనీయమైన విజయాన్ని సాధించింది. తమిళనాడు రూ.7 కోట్లు, కేరళ రూ. 5 కోట్లు, కన్నడలో రూ.1 కోటి చొప్పున కలెక్షన్స్ వసూళ్లు చేసినట్లు Sacnilk వెబ్‌సైట్ లెక్కలు చెబుతున్నాయి.
దాదాపు రూ.203 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించవచ్చనే అంచనా ఉంది. ఇంకా కాసేపట్లో పుష్ప 2 అధికారిక సంస్థ నుండి డే 1 గ్రాస్ కలెక్షన్స్ ఎంతనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
ఇకపోతే పుష్ప 2 మూవీకి తెలుగు రాష్ట్రాలలో గురువారం (ఫస్ట్ డే) మొత్తం 82.66 ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. అందులో తెలుగు ఆక్యుపెన్సీ మార్నింగ్ షోలు 78.27 శాతం, మధ్యాహ్నం షోలు 77.09 శాతం, ఈవినింగ్ షోలు 85.07 శాతం, నైట్ షోలు 90.19 శాతంగా నమోదు అయ్యాయి.
హిందీలో 'పుష్ప 2' ఆక్యుపెన్సీ మొత్తం 59.83 శాతం నమోదు అయింది. అందులో మార్నింగ్ షోలు 41.12 శాతం, మధ్యాహ్నం షోలు 50.94 శాతం, ఈవినింగ్ షోలు 62.52 శాతం, నైట్ షోలు 84.75 శాతం.
ఇక పుష్ప 2 హిందీ వెర్షన్ రూ.67 కోట్ల రూపాయలు సాధించడంతో బాలీవుడ్ లో మరోసారి ఐకాన్ జెండా పాతేసాడని చెప్పొచ్చు. గతంలో షారుక్ 'జవాన్' మూవీకి రూ.64 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని దాటేసిన అల్లు అర్జున్ బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో చూపించేశాడు.