బుకింగ్స్ తోనే అరాచకం రిలీజ్కు ముందే పుష్ప 2 ఊచకోత
Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2 The Rule) రిలీజ్కు ముందే ప్రతి విషయంలో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వెళ్తోంది. బిగ్గెస్ట్ ఇండియన్ రిలీజ్ సినిమాగా 11, 500 థియేటర్స్ లలో రావడం, రూ.1025+ కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడం, హయ్యెస్ట్ టికెట్ రేట్స్ తో రిలీజ్ అవ్వడం, ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్లో దూసుకెళ్లడం ఇలా ప్రతిదానిలో పుష్ప 2 మార్క్ చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో మరో అరుదైన రికార్డ్స్ నెలకొల్పే దిశగా దూసుకెళ్తోంది. నవంబర్ 30న ఇండియాలో బుకింగ్స్ మొదలయ్యాయి. ఆల్ ఓవర్ ఇండియాలో 15,754 షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. 6.59 లక్షలకి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మార్నింగ్ షోస్కి వీపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వీటి ద్వారా రూ.32.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి.
అందులో తెలుగు షోలు గరిష్టంగా అక్యుపెన్సీని నమోదు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలలో రూ.16.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా హిందీ బెల్ట్లో రూ.14.84 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ రానున్న మూడ్రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్లో పుష్పగాడి టికెట్ల ప్రభంజనం రూ.70 కోట్లు దాటే అవకాశం ఉంది.
ఇండియాలో హిందీ వెర్షన్ కోసం ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్‌లలో 24 గంటల్లో 1 లక్షకు పైగా టిక్కెట్‌లను విక్రయించింది. దీంతో పుష్ప 2 స్త్రీ 2 (41k), డంకీ (42k), యానిమల్ (52.2k), మరియు టైగర్ 3 (65k) వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని అధిగమించింది.