ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప 2 నెక్ట్స్ టార్గెట్ ప్రభాస్, యష్
Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : పుష్ప 2 (Pushpa 2) అడ్వాన్స్ బుకింగ్స్లో దూసుకెళ్తోంది. వరల్డ్ వైడ్గా పుష్ప 2 రూ.100 కోట్లు కలెక్ష్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కేవలం ఇండియాలోనే రూ.62.55 నుండి రూ.64.10 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇందులో ఒక్క హిందీ వెర్షన్ లోనే 24.12 కోట్లు, తెలుగు 2డి వెర్షన్ 34.37 కోట్లు వసూలు చేసింది. తమిళ వెర్షన్ మొత్తం రూ.17.32 కోట్లు రాబట్టింది, కేరళ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.3 కోట్లకు చేరుకుంది. ఇక మొత్తం బ్లాక్ సీట్లతో సహా, ఇండియా వైడ్ గా పుష్ప 2 రూ.77.97 కోట్ల వసూళ్లు చేసి రికార్డులను బ్రేక్ చేస్తోంది.
ఇప్పటివరకు బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన మూవీగా బాహుబలి 2, కేజీఎఫ్ 2, కల్కి లు ఉన్నాయి. ఇపుడీ ఆ సినిమాల రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేసింది. తాజాగా పుష్ప 2 మరో సినిమా రికార్డును బీట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ రికార్డునూ వెనక్కి నెట్టింది. గతంలో RRR మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో సాధించిన రూ.59 కోట్ల రికార్డును పుష్ప 2 అధిగమించింది. కల్కి 55.30కోట్లు.
ఇండియా బాక్సాఫీస్ వద్ద టాప్ 5 ఓపెనింగ్ డే ప్రీ-సేల్స్...
KGF చాప్టర్ 2- 80.50 కోట్లు
బాహుబలి 2 - 80 కోట్లు
పుష్ప 2- 64.10 కోట్లు (1 రోజు మిగిలి ఉంది)
RRR - 59 కోట్లు
కల్కి 2898 AD - 55.30 కోట్లు
అయితే, రూ.100 కోట్ల మార్క్ అనేది ఓవర్సీస్ తో కలుపుకుంటే వచ్చింది. కానీ, ఇండియాలో పుష్ప 2 కాస్తా వెనకబడి ఉంది. బాహుబలి 2 మూవీ రూ.90 కోట్ల అడ్వాన్స్ సేల్స్తో అందనంత ఎత్తులో ఉంది. ఇపుడు పుష్ప 2 చూపిస్తున్న జోరుకు బాహుబలి 2 ని అందుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
ఇకపోతే పుష్ప 2 ఫస్ట్ డే రూ.250-300కోట్ల మేరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో RRR (2022) రూ.223 కోట్లతో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రికార్డును కలిగి ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియన్ సినిమాకి ఇవే హయ్యెస్ట్ కలెక్షన్స్. మరి పుష్ప 2 ఫస్ట్ డే ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.