Type Here to Get Search Results !

Sports Ad

పుష్ప 2 వరల్డ్ వైడ్ గ్రాస్, నెట్ కలెక్షన్స్ ఇవే ఇండియాలో ఎంతంటే Pushpa 2 World Wide Gross, Net Collections Are The Same In India

పుష్ప 2 వరల్డ్ వైడ్ గ్రాస్, నెట్ కలెక్షన్స్ ఇవే ఇండియాలో ఎంతంటే

Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule).. ఇపుడు గత ఇండియన్ సినిమాల రికార్డులను తిరగరాస్తోంది. పంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ఓ హుషారు పెంచింది. ఈ మూవీ ఫస్ట్ డేనే రూ.294 కోట్లు గ్రాస్ సాధించి సినీ చరిత్రలో హయ్యెస్ట్ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.

 ఇందులో Dec4 ప్రీమియర్తో కలిపి రూ.175 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని సమాచారం. (తెలుగులో రూ.80.3 కోట్లు, హిందీ రూ.70.3 కోట్లు, తమిళంలో రూ.7.7 కోట్లు, కేరళ రూ.1కోటి, మలయాళంలో రూ.4.95 కోట్లు). దీంతో ఈ మూవీ రెండో రోజు కలెక్షన్స్ తెలుసుకోవాలనే ఆసక్తి రేపుతోంది. 
ఈ నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప 2 మూవీ రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తుందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 ఇక సెకండ్ డే ఇండియాలో రూ. 90 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ప్రముఖ Sacnilk సంస్థ వెల్లడించింది. ఇందులో (తెలుగులో రూ.27 కోట్లు, హిందీ రూ.55 కోట్లు, తమిళంలో రూ.5.5 కోట్లు, కేరళ రూ.6లక్షలు, మలయాళంలో రూ.1.9కోట్లు) వసూళ్లు ఉన్నాయి.

 ఇక రెండ్రోజుల్లో పుష్ప 2 మూవీకి ఇండియా వైడ్గా రూ.265 కోట్లు నెట్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో (తెలుగులో రూ.118.05 కోట్లు, హిందీ రూ.125 కోట్లు, తమిళంలో రూ.13.2 కోట్లు, కేరళ రూ1.6కోట్లు, మలయాళంలో రూ.6.85కోట్లు). కాగా పుష్ప 2 సినిమాకి రెండో రోజు 53 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

 ఇదిలా ఉంటే, ఓవర్సీస్‌లో ఫస్ట్ డే 8 మిలియన్ డాలర్స్ పుష్ప 2 వసూళ్లు చేసింది. తెలుగు కరెన్సీలో సుమారుగా రూ. 67.73 కోట్లు. దీంతో ఓవర్సీస్‌లో కూడా 2024లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డ్ నెలకొల్పింది. ఇక ఇవాళ (Dec 7న) సాయంత్రం లోపు రెండ్రోజుల గ్రాస్ కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies