త్వరలో 5జీ సేవలు ప్రకటించిన వొడాఫోన్ ఐడి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని వొడాఫోన్ఐడియా (వీఐ) ప్రకటించింది. ఇదివరకే కొన్ని నగరాల్లో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టామని కంపెనీ క్లస్టర్ బిజినెస్ హెడ్ (ఏపీ, తెలంగాణ, కర్ణాటక) ఆనంద్ దానీ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నెట్వర్క్ విస్తరణ కోసం రూ.4,122 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు.
‘‘తెలంగాణలో మాకు ఐదు వేలకుపైగా టవర్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మాకు కోటి మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. యావరేజ్రెవెన్యూ పర్ యూజర్(ఆర్పూ) రూ.200 వరకు ఉంది”అని వివరించారు.