తప్పు చేసి సారీ చెప్పాడు హెడ్‌కు ఆకాష్ దీప్ క్షమాపణలు
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య వార్ కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టులో గమ్మత్తయిన సంఘటన ఒకటి జరిగింది. స్పిన్నర్ లియోన్ ఇన్నింగ్స్ 78 వ ఓవర్ రెండో బంతిని ఆడడంలో ఆకాష్ దీప్ విఫలమయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ కి తగిలి బాల్ అతని ఎడమ కాలి ప్యాడ్ లో ఇరుక్కుంది. బంతిని తీసి ఆకాష్.. ఫార్వర్డ్ షార్ట్ లెగ్ వద్ద నిలబడి ఉన్న హెడ్‌కి ఇవ్వకుండా అతను చూస్తుండగానే బంతిని నేలపై పడేశాడు. ఆకాష్ దీప్ చేసిన పనికి హెడ్ నిరాశకు గురయ్యాడు.
ఆకాష్ దీప్ వెంటనే హెడ్ కెళ్ళి చూస్తూ అతను చేసిన పనికి సారీ చెప్పాడు.
ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్-బ్యాటర్ అలెక్స్ కారీ కూడా ఆకాష్‌తో ఏదో మాట్లాడగా అతనికి కూడా వెనక్కి తిరిగి అతనికి క్షమాపణలు చెప్పాడు. అయితే ఈ సంఘటన అక్కడ ఉన్నవారు అందరూ ఎంతో స్పోర్టీవ్ గా తీసుకున్నారు. ఎవరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకుండా చాలా సరదాగా ఈ సీన్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆకాష్ దీప్ బ్యాట్ తో అద్భుతంగా రాణించాడు. 31 పరుగులు చేసి భారత్ ను ఫాలో ఆన్ నుంచి తప్పించాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ముగిసిన ఈ టెస్టులో ఐదో రోజు వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రా గా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 275 పరుగుల లక్ష్యంతో చివరి రోజు బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 2.1 ఓవర్లు మాత్రమే ఆడింది. ఈ దశలో వర్షం రావడంతో అంపైర్లు టీ విరామం ఇచ్చారు. టీ బ్రేక్ తర్వాత వర్షం తగ్గకపోవడంతో ఇరు జట్లు డ్రా కు అంగీకరించారు. మ్యాచ్ డ్రా కావడంతో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-1 తో సమంగా నిలిచాయి.