Type Here to Get Search Results !

Sports Ad

అల్లు అర్జున్ బెయిల్ రద్దు కాబోతున్నదా హైకోర్టులో పోలీసుల అప్పీల్ Allu Arjun's Bail Is About To Be Canceled Police Appeal In The High Court

అల్లు అర్జున్ బెయిల్ రద్దు కాబోతున్నదా హైకోర్టులో పోలీసుల అప్పీల్

Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు తిరగబోతుందా బెయిల్ రద్దు కాబోతున్నదా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు అయ్యి అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లబోతున్నారా ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు. 

 సంధ్య ధియేటర్ దగ్గర తొక్కిసలాటలో అరెస్ట్ అయ్యి ఒక రోజు చంచల్ గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో 24 గంటల్లోనే జైలు నుంచి బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఈ విషయంపై పోలీస్ శాఖ అప్పీల్ కు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 అల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలటూ తెలంగాణ పోలీసులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సమాచారం. దీని కోసం ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారంట. 4 వారాలు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇంత కంటే ముందే మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిన సమయంలోనూ ఈ బెయిల్ పై పీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం టీవీల్లోనూ వచ్చింది. అప్పట్లోనే డివిజన్ బెంచ్ పై అప్పీల్ చేస్తారని భావించినా నాలుగు రోజులు సమయం తీసుకుని అన్ని చక్కబెట్టుకుని అప్పీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

 అల్లు అర్జున్ బెయిల్ తో అన్నీ విషయం కొలిక్కి వచ్చినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ అంతే వేగంగా తెరపైకి రావటం విశేషం. హైకోర్టు డివిజన్ బెంచ్ లో పోలీసులు అప్పీల్ చేసి గట్టిగా వాదనలు వినిపిస్తే మాత్రం బన్నీ మళ్లీ చంచల్ గూడ జైలుకు వెళ్లటం ఖాయంగానే కనిపిస్తుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies