Type Here to Get Search Results !

Sports Ad

చలి జ్వరాలు వస్తున్నాయా ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ పరీక్షలు చేయించుకోండి బీ అలర్ట్ Are Cold Fevers Coming Take These Precautions Get These Tests Done Be Alert

చలి జ్వరాలు వస్తున్నాయా ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ పరీక్షలు చేయించుకోండి బీ అలర్ట్

Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : నాలుగు రోజుల నుంచి చలి బాగా పెరిగిపోయింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా చంపేస్తోంది. ఒక్కసారిగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పులను శరీరం వెంటనే సర్దుబాటు చేసుకోదు. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‎లు ఎక్కువగా వ్యాపిస్తాయి. దాంతో బాడీ అంతా నలతగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు, బద్ధకంతో జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. అలాగని టాబ్లెట్స్ మింగడం అంత మంచిది కాదు.

చలి జ్వరాలు...
శీతాకాలంలో పళ్లు వెచ్చబడినట్లు అనిపిస్తుంది. అది జ్వరమా కాదా అని కూడా అర్ధంకాదు. ఏ పని చేయాలన్నా శరీరం సహకరించదు. అస్తమానం పడుకోవాలనిపిస్తుంది. దాంతో చాలామంది జ్వరం వచ్చిందనుకుని టాబ్లెట్స్ వేసుకుంటారు. సాధారణంగా ఈ కాలంలో చికెన్ గున్యా, మలేరియా, స్వైన్ఫ్లూ వంటి విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగని ప్రతి చిన్న విషయానికి భయపడాల్సిన అవసరం లేదు.

జ్వరమా... కాదా...
సాధారణంగానే చలికాలంలో శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. చలికి బాడీ పెయిన్స్, తలనొప్పి, బడలిక అనిపిస్తుం ది. ఒక్కోసారి వంద వరకు టెంపరేచర్ పెరుగుతుంది కూడా. అలాంటప్పుడు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ కొందరు విశ్రాంతి తీసుకోడానికి బదులు. జ్వరం వచ్చిందని వాళ్లకు వాళ్లే సొంతంగా నిర్ణయించుకని ప్యారాసెటమాల్ లాంటి బిళ్లలు వేసుకుంటారు.

రోజూలాగే పనికి వెళ్తారు. దాంతో బడలిక తగ్గకపోగా, ఇంకా పెరుగుతుంది. నొప్పులు ఎక్కువవుతాయి. కాబట్టి శరీరం అనీజీగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అంతేగాని ఎడా పెడా ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాతి కాలంలో ఆ ప్రభావం శరీరంపై పడుతుంది కూడా. శీతాకాలంలో నొప్పులున్నా, తలనొప్పి వచ్చినా బాడీ టెంపరేచర్ వంద దాటితేనే ఫీవర్ వచ్చినట్లని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే ప్రతి దానికీ కంగారు పడాల్సిన అవసరం లేదు.

పరీక్షలు అవసరమే...
నిజానికి జ్వరం అంటే రోగం కాదు. అది జ్వరం రూపంలో బయటపడుతుంది మామూలుగా అయితే ఒకటి రెండు రోజుల్లో బాడీ ఆ మార్పును సర్దుబాటు చేసుకుంటుంది. అలా చేసుకోలేనప్పుడే జ్వరం వస్తుంది. జ్వరంతోపాటు బాడీ పెయిన్స్, నీరసం లాంటివి సహజం. అందుకే జ్వరం రెండు మూడురోజులైనా తగ్గకపోతే డాక్టర్ను కలవాలి. రెండు రోజుల్లో తగ్గిపోతుంది. కదా అని జ్వరాన్ని పట్టించుకోకపోతే, ఆరో గ్యంపై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే శీతాకాలంలో వ్యాపించే బ్యాక్టీ రియా ఊపిరితిత్తులు, రక్తనాళాలు, చర్మంపై దాడి చేస్తుంది.

రాకుండా...
చలికాలంలో జ్వరం వచ్చినా రాకపోయినా ఆరోగ్యంపై తప్పకుండా శ్రద్ద పెట్టాలి. శుభ్రత పాటించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మిగతా రోజుల్లా ఫ్రిజ్ లో పెట్టినవి తిండి తినడం మంచిది కాదు. నూనె, కారం తక్కువగా వాడాలి. ఇడ్లీ, బ్రెడ్, యాపిల్, కొబ్బరి నీళ్లు లాంటివి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రాగులు, జొన్నల వంటి చిరుధాన్యాలతో చేసిన పదార్ధాలు ఈ రోజుల్లో తీసుకోవడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది.

 కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, ఆస్తమా లాంటి దీర్ఘ కాలిక రోగాలున్న వాళ్లు వీటిని తినడం వల్ల ఈ రోజుల్లో వచ్చే అనారోగ్య సమస్యలను చాలా వరకు తగ్గించొచ్చు. అంతేకాదు ఇవి శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరిస్తాయి. రోగ నిరోధక శక్తినీ పెంచుతాయి. అందు వల్ల చలికాలంలో వచ్చే సాధారణ జ్వరాలు దరిచేరవు.
ఈ కాలంలో చలిపెరగడం వల్ల వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. దగ్గు, జ్వరం, తలనొప్పితో కూడిన జ్వరాలు వస్తుంటాయి. బాడీ టెంపరేచర్ నార్మల్ గా  ఉంచుకోవాలి. అంటే 25 నుంచి 26 వరకు ఉండేలా జాగ్రత్తపడాలి. చలికాలంలో ఎవరి చేతులైనా చల్లగా ఉంటాయి కాబట్టి, జ్వరం ఉంది లేందీ చేతులతో చూస్తే తెలియదు. ఎదుటి వాళ్ల శరీరం వేడిగానే అనిపిస్తుంది. అందుకే చలికాలంలో జ్వరాన్ని చేతులతో చూడ్డం మానేయాలి. ధర్మామీటర్ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కరు 104, 105 ఫీవర్ తో హాస్పిటల్‎కు వస్తున్నారు.

 ఆఫీసులు, సినిమాహాళ్లు లాంటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల పక్కవాళ్ల నుంచి జలుబు, దగ్గు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి వల్ల కూడా జ్వరం వస్తుంది. రెండు రోజుల నుంచి వర్షాలు పడటం వల్ల నీళ్లు, తినే పదార్థాలు కాలుష్యం కావచ్చు. బయట దొరికే పానీపూరి, బజ్జీలు లాంటివి తినకపోవడమే మంచిది. అప్పుడే చేసినవి, వేడిగా ఉన్న వాటినే తీసుకోవాలి. చిన్నపిల్లలు, వయసులో పెద్దవాళ్లు ఉదయం, సాయంత్రం బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్‎లు, చెవులను కప్పి ఉంచే మంకీక్యాప్స్ వాడాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies