Type Here to Get Search Results !

Sports Ad

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకున్నారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలే మంత్రి సీతక్క BRS MLAs Wore Bedis But KTR And Harish Could Not Wear Bedis, Minister Sitakka

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకున్నారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలే 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బీఆర్ఎస్ నేతల నిరసనపై అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకున్నారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదని ఆమె చెప్పారు. కేటీఆర్, హరీష్ దొరతనం ఇలా మరోసారి బయటపడిందని ఆమె వ్యాఖ్యానించారు. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదని ఎద్దేవా చేశారు. నిరసనల్లో కూడా తమ దురహంకారాన్ని ప్రదర్శించారని విమర్శించారు.

 రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని, బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారని ఆమె గుర్తుచేశారు. అప్పుడు అధికారుల మీద కనీస చర్యలు లేవని, రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి చర్యలు కూడా తీసుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటి ? గతంలో వెల్లోకి వస్తే సభ నుంచి సస్పెండ్ చేసేవారని, కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలను వాళ్లే కాలరాస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies