Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ అల్కాపురి కాలనీలో హైడ్రా దూకుడు అపార్ట్ మెంట్లలోని షాపులు కూల్చివేత Demolition Of Shops In Hydra Aggressive Apartments In Alkapuri Colony, Hyderabad

హైదరాబాద్ అల్కాపురి కాలనీలో హైడ్రా దూకుడు అపార్ట్ మెంట్లలోని షాపులు కూల్చివేత

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ లోని మణికొండలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు.స్థానిక అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ లో అనుమతి లేకుండా నిర్మించిన  కమర్షియల్‌ షెట్టర్స్ ను తొలగించారు అధికారులు. రెసిడెన్షియల్ గా అనుమతులు తీసుకొని కమర్షియల్‌ గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో గత వారం స్పాట్ విజిట్ చేసిన హైడ్రా కమీషనర్ రంగనాథన్ షట్టర్ల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. కమీషనర్ అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను తొలగించారు అధికారులు. 

 ఈ క్రమంలో అధికారులకు వ్యాపారస్తులకు మద్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం కొనసాగిస్తున్నామని.. మణికొండ మునిసిపాలిటీ కి లక్షల రూపాయలు కమర్షియల్‌ ట్యాక్స్ చెల్లిస్తున్నామని అన్నారు వ్యాపారస్తులు. రెసిడెన్షియల్ నుండి కమర్షియల్‌ గా కన్వర్షన్ కూడా అయిందని.. ఓ బడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేసారంటూ దుమ్మెత్తి పొస్తున్న వ్యాపారులు. సదరు బడా వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేసాడని డబ్బులు ఇవ్వకపోతే అతని‌ పలుకుబడి ఉపయోగించి అధికారులను ఒత్తిడి చేసాడని అంటున్నారు వ్యాపారస్తులు.

 తెల్లవారుజామున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని  హైడ్రా కమీషనర్ రంగనాథన్ కు ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు వ్యాపారస్తులు.‌ డబ్బులు ఇవ్వకుంటే షాపులు కూల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు వ్యాపారస్తులు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies