Type Here to Get Search Results !

Sports Ad

ఒక్క జామ పండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా డోంట్ మిస్ Don't Miss These Health Benefits If You Eat One Guava Fruit

ఒక్క జామ పండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా డోంట్ మిస్

Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : ఆరోగ్య జామ జామలో రుచికి రుచి దాంతో పాటు ఎన్నో వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోధకశక్తి పుష్కలంగా ఉంది.

జామ పండుతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని ఇవి...
* జామపండులో విటమిన్-ఏ చాలా ఎక్కువ. ఇది కంటిచూపును చాలాకాలం పాటు పదిలంగా కాపాడుతుంది. క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ వంటి అనేక కంటి వ్యాధులను జామ నివారిస్తుంది. 

* జామలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. 

* జామలో పీచు పదార్ధాలు ఎక్కువ, చక్కెర శాతం తక్కువ. అందుకే బరువు నియంత్రించడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. అందుకే క్రమం తప్పకుండా జామ పండు తినేవారి బరువు నియంత్రణలో ఉంటుంది. 

* జామలో విటమిన్-సి పుష్కలం. అందుకే ఇది విటమిన్-సి లోపం వల్ల వచ్చే స్కర్వీతో పాటు అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

* జామ చాలా థైరాయిడ్ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి జామ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. 

* జామపండు తినేవారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇందులోని విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాలే దీనికి కారణం.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies