Type Here to Get Search Results !

Sports Ad

కొత్తిమీర తింటే చాలు ఆరు విటమిన్లు పుష్కలంగా తిన్నట్లే ట్యాబ్లెట్లతో పనేలేదు Eating Cilantro Does Not Work With Tablets Just Like Eating Plenty Of Six Vitamins

కొత్తిమీర తింటే చాలు ఆరు విటమిన్లు పుష్కలంగా తిన్నట్లే ట్యాబ్లెట్లతో పనేలేదు

Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : కొత్తిమీరను కేవలం రుచి, సువాసనల కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. కొత్తిమీరతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలెన్నో, కొత్తిమీరతో సమకూరే లాభాల్లో ఇవి కొన్ని కొత్తిమీరలో విటమిన్-ఏ పుష్కలంగా ఉండటం వల్ల అది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

 ఇందులో విటమిన్-బి కాంప్లెక్స్కు చెందిన బి1, బి2, బి3, బి5, బి6 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే. ఇవన్నీ మనకు వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయి విటమిన్ -సి కూడా కొత్తిమీరలో ఉండటం వల్ల అది శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

 కొత్తిమీరలో విటమిన్-ఇ కూడా ఉంటుంది. శరీరానికి మంచి నిగారింపును ఇవ్వడానికి, చర్మంపై ముడతలను తొలగించడానికి బాగా తోడ్పడుతుంది. కొత్తిమీరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అనీమియాతో బాధపడేవారు. తినే అన్ని పదార్ధాలను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తింటే ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఇందులోని పొటాషియమ్ రక్తపోటును నివారిస్తుంది. తద్వారా గుండెజబ్బులను అరికడుతుంది. కొత్తిమీర కిడ్నీ సమస్యలను సమర్థంగా నివారిస్తుంది.

 మెగ్నీషియమ్, జింక్ వంటి ఖనిజాలు కొత్తిమీరలో బాగా ఎక్కువే. అందుకే జుట్టు మంచి మెరుపుతో నిగనిగలాడేందుకు కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో కాల్షియమ్ కూడా ఎక్కువే. అందుకే అది ఎముకలను పటిష్టంగా మార్చి, వాటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies