Type Here to Get Search Results !

Sports Ad

రోజురోజుకు పెరుగుతున్న గుండె జబ్బులు ఇవి తింటే కొద్దిగా అయినా తప్పించుకోవచ్చు Heart Diseases Which Are Increasing Day By Day Can Be Avoided If You Eat Them

రోజురోజుకు పెరుగుతున్న గుండె జబ్బులు ఇవి తింటే కొద్దిగా అయినా తప్పించుకోవచ్చు

Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : ప్రపంచవ్యాప్తంగా అనేకమంది గుండె జబ్బుల బారిన పడుతున్నా రు. ఎక్కువ శాతం మంది చనిపోతున్నారు కూడా. గుండె జబ్బు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కారణాలు ఏమైనా గుండె జబ్బులు వచ్చాక బాధపడటం కంటే రాకముందే జాగ్రత్త పడడం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే నిత్యం వ్యాయామం చేయడం, సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండడం, పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి అయింది. అయితే ఇవే కాకుండా నిత్యం తీసుకునే ఆహారంలో వాల్ నట్స్ ను చేర్చుకున్నా గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 

 అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషియన్ సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో వాల్ నట్స్ గుండె జబ్బులు రాకుండా ఆపుతాయని తెలిసింది. నిత్యం తగినన్ని వాల్ నట్స్ తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు బాగా తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు  వచ్చే అవకాశాలు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. వాల్ నట్స్ లో  ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. నిత్యం 60 గ్రాముల వాల్ నట్స్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం తోపాటు  టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies