రాత్రుళ్లు స్వీట్స్ తింటున్నారా వెంటనే మానేయండి లేకపోతేఆరోగ్యం పాడువుతుంది
Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : కొందరికి స్వీట్స్ అంటే భలే ఇష్టం. ఎప్పుడంటే అప్పుడు ఎన్నంటే అన్ని తినేస్తుంటారు. ఫంక్షన్లకు వెళ్లినా బేకరీలకు వెళ్లినా నాలుగు రకాల స్వీట్లను పొట్టలో పడేస్తారు. ఇంకొందరైతే భోజనం చేసిన వెంటనే మరీ ముఖ్యంగా రాత్రిపూట ఏదో ఒక స్వీట్ కచ్చితంగా తింటారు. దానివల్ల వాళ్లలో చాలామంది పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అందుకే స్వీట్ తినాలన్న కోరికను మెల్లిమెల్లిగా తగ్గించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
అది చక్కెరతో చేసిన స్వీట్ అయినా తియ్యని పండు అయినా ఉదయంపూట తినడమే ఆరోగ్యానికి మంచిదట. కానీ చాలామంది రాత్రిపూట తింటుంటారు. అలా వాళ్లకు తినాలనిపించడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే రాత్రిపూట సీట్ తినకుండా ఉండాలంటే కొన్ని సలహాలు పాటించాలంటారు న్యూట్రిషనిస్టు. అవేంటో తెలుసుకుని, రాత్రిపూట చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి.
మధ్యాహ్నం పండ్లు వద్దు...
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి వండ్లనైనా తినొచ్చు. అలాగే మధ్యాహ్నం తీసుకునే స్నాక్స్ లో బిస్కెట్లు, చాక్లెట్లకు బదులుగా ఒక పండుముక్క తినడం మంచిది. కానీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత. మాత్రం పండ్లు లేదా స్వీట్లు తినొద్దంటున్నారు డాక్టర్లు. అలా తిన్నవాళ్లలోనే చాలామందికి రాత్రిపూట చక్కెర పదార్థాలు తినాలనే కోరిక ఉంటుందట.
ఎక్కువ ప్రొటీన్లు తీసుకోవాలి...
మధ్యాహ్న భోజనం తర్వాత తీసుకునే స్నాక్స్ లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యనే తినాలి. దానివల్ల శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఆ స్నాక్స్ కి వెజిటబుల్ సలాడ్ మంచి ఆప్షన్.
దాల్చినచెక్క పొడి...
రోజూ ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. అది శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అలాగే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ నితగ్గించి, స్వీట్ తినాలనే కోరికను దూరం చేస్తుందట. ఈ దాల్చినచెక్క పొడిని బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్ (స్నూతీ) పైన చల్లుకుని తినొచ్చు..
బ్యాలెన్స్ మీల్స్ అవసరం
తీసుకునే ఆహారం ఎప్పుడూ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంటే ఫ్యాట్, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్స్ ఆహారంలో సమపాళ్లలో ఉంటేనే అది ఫుల్ మీల్స్ అవుతుంది. ఇలా తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి పూర్తిగా అంది చక్కెర తినాలనే కోరిక కలగదు.
భోజనం మానొద్దు...
రోజులో మూడు పూటలు తినడం మనకు ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు. అలాకాకుండా రోజుకు ఐదారు సార్లైనా సరే కొద్దికొద్దిగా తీసుకోవడం ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. ఇలా రోజంతా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే రాత్రిపూట ఇది తినాలి అది తినాలి అని అనిపించదు. అలాగే రోజులో ఒక్క పూట కూడా భోజనం తినడం మావొద్దు. మరీ ముఖ్యంగా ఉదయం పూట చేసే బ్రేక్ ఫాస్ట్ ని అసలు బ్రేక్ చేయొద్దు.
ఫీలింగ్స్ చెక్ చేసుకోవాలి...
చాలామందికి రాత్రిపూట స్వీట్ తినాలనిపించడానికి కారణం. రోజంతా కష్టపడటం కూడా అయ్యుండొచ్చు. బాధలో, టెన్షన్ లో , అలసిపోయినప్పుడు స్వీట్ తింటే కొంతమందికి ఉపశమనం లభిస్తుంది. అలాగే చెప్పలేనంత ఆనందంగా అనిపించినా, స్వీట్స్ తినడం అలవాటుగా ఉంటుంది.
ఇలాంటి సమయాల్లో ఫీలింగ్స్ పాటు ఆరోగ్యాన్నీ చెక్ చేసుకుని హెర్బల్ టీ, సూప్స్ లాంటివి తీసుకోవడం మంచిది.