ఉదయాన్నే వేడినీళ్లు తాగుతున్నారా అయితే మీ జర్ణశక్తి అద్భుతంగా పని చేస్తుంది
Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : తిన్న ఆహారం జీర్ణం కాలేదని మందులు వేసుకుంటాం. కానీ, ప్రతి చిన్న విషయానికి మందులు వాడితే ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రతి రోజు వేడినీళ్లు తాగితే జీర్ణశక్తి మెరుగవుతుందని చెబుతున్నారు. వేడినీళ్లు తీసుకోవడం వల్ల ఆకలి వేస్తుంది. మల విసర్జన సాఫీగా జరిగి కడుపు ఉబ్బరం ఉండదు. ఎక్కిళ్లు. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వేడినీళ్లతో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు రాత్రిళ్లు నిద్రపోయే ముందు వేడినీళ్లు తాగితే వాతం, కఫం తగ్గిపోతుంది. తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవాళ్లు వేడినీళ్లు తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. క్లోమగ్రంధి పనితీరు కూడా మెరుగవుతుంది.