లెమన్ టీ తక్కువగా తాగితే ఆరోగ్యం ఎక్కవైతే ఎసిడిటీ వస్తోంది జాగ్రత్త
Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : శరీరం లో కొవ్వుని తగ్గించు కోవడంకోసం చాలామంది. ఉదయాన్నే నిమ్మరసాన్ని లెమన్ టీ ను తాగుతుంటారు.ఇలా చేయడం మంచిదే కానీ ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఏవో తెలుసుకుందాం.
ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం మంచిదే అయినా నిమ్మరసాన్ని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. పరగడుపున ఎక్కువ నిమ్మరసం తీసుకోవడం వల్ల పులుపుప్రభావం దంతాలపై పడుతుంది. అది ఇంకా ఎక్కువైతే దంతాల నుంచి చిగుళ్లపై కూడా ప్రభావం పడొచ్చు. అందుకే నిమ్మరసాన్ని కొద్దిమొత్తంలోనే తీసుకోవాలి.
అలాగే నిమ్మరసం లేదా లెమన్ టీ తాగే ముందు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకోకుండా డైరెక్ట్ గా నిమ్మరసాన్ని తాగితే నోటిలోని బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లే ప్రమాదముంది. అందుకే నిమ్మరసాన్ని తాగే ముందు కనీసం నోరు అయినా పుక్కిలించాలి. నిమ్మ రసానికి బరువుని తగ్గించే గుణం ఉన్నా, మరీ ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీకి కారణమవుతుంది. అందుకే రోజుకి సగం నిమ్మ బద్ద తీసుకుంటే సరిపోతుంది. అలాగే నిమ్మరసాన్ని అల్లం కూడా కలిపితే ఇంకా లాభముంటుంది.