Type Here to Get Search Results !

Sports Ad

పొద్దుగాల లేస్తేనే బోలెడు లాభాలు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎక్కువ డబ్బు కూడా వస్తుందంట If You Wake Up, You Will Get A Lot Of Benefits, Confidence Will Increase And More Money Will Come

పొద్దుగాల లేస్తేనే బోలెడు లాభాలు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎక్కువ డబ్బు కూడా వస్తుందంట

Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : ఉదయం త్వరగా నిద్రలేవాలి అని ప్రతి రోజు పడుకునే ముందు చాలామంది అనుకుంటారు. అందుకు అనుగుణంగా అలారం కూడా పెట్టుకుంటారు. కరెక్ట్​ గా  ఉదయం 5గంటలకు పెద్ద మోత వినిపిస్తుంది. చికాకుతో నిద్రలేచి కాస్త బద్దకంగానే అలారం ఆఫ్ చేసి మళ్లి పడుకుంటారు. ఇది చాలామంది జీవితాల్లో ప్రతి రోజు జరిగేదే. కానీ ఒక ముప్పై రోజులు బద్ధకాన్ని పక్కకు పెట్టి, 5గంటలకే నిద్రలేస్తే లైఫ్ మారిపోతుంది అంటున్నారు. నిపుణులు. ఉదయం లేవడానికి లైఫ్ మారడానికి సంబంధం ఏంటి అంటారా అయితే ఈస్టోరీపై ఓ లుక్కేయండి.

 త్వరగా నిద్ర లేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సరే. కానీ త్వరగా లేవాలంటే ఏం చేయాలి త్వరగా పడుకోవాలి కానీ అది అంత ఈజీ కాదు. స్మార్ట్ ఫోన్ వచ్చిప్పటినుంచి రాత్రి 9గంటల్లోపు పడుకునేవాళ్ల సంఖ్య బాగా తగ్గింది. పది దాటినా ఫోన్ పట్టుకునే ఉంటారు. అందుకే తొమ్మిది దాటగానే ఫోన్ పక్కన పెట్టేయ్యాలి. కాస్త కష్టమే కానీ కొన్ని రోజులు అలా చేస్తే అలవాటైపోతుంది. అంతేకాదు త్వరగా పడుకోవాలంటే త్వరగా తినాలి కూడా దీనివల్ల  ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సాయంత్రం ఏడులోపు డిన్నర్ చేసే వాళ్లకి ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి.

 కొందరైతే త్వరగా పడుకున్నా త్వరగా నిద్ర లేవరు. అలారం మోగగానే ఆఫ్ చేసి పడుకుంటారు. ఇలాంటి వాళ్లు అలారం క్లాక్​ ను  దూరంగా లేదా పక్క గదిలో పెట్టుకొని వాడుకోవాలి. దీంతో అలారమే ఆఫ్ చేయలేం కదా ఉదయం లేచి ఏం చెయ్యాలి అనేవి ముందురోజ్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే లేవగానే పని లేకుంటే నిద్ర వస్తుంది. ఆచారం ఆఫ్ చేసిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగాలి. తర్వాత మళ్లీ బెడ్ వైపు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే మళ్లీ పడుకోవాలనిపిస్తుంది. తర్వాత వాకింగ్, జాగింగ్ మంచిది. ఇలా చేస్తే నిద్రలేచిన 5 నుంచి 10 నిమిషాల్లోనే మీ బ్రెయిన్ చురుకు అవుతుంది

 త్వరగా నిద్రలేవడం అన్ని రకాలుగా మంచిదని తెలిసిన ఉదయం ఎనిమిది దాటితే గానీ నిద్రలేవని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా చలికాలంలో ఇది మరీ ఎక్కువ ఇక సిటీల్లో ఉండేవాళ్లయితే. చాలామంది ఉదయం తొమ్మిది గంటల వరకు ముసుగుతన్ని పడుకుంటారు. కానీ దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. అలవాటు కావాలే కానీ ఎర్లీ వేకప్ పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ లెక్క చేయకుండా ముప్పై రోజుల వరకు రోజూ ఉదయం 5గంటలకే నిద్ర లేస్తే చాలా మార్పు వస్తుంది. ఆ తర్వాత 5 దాటి అరగంట పడుకోమన్నా పడుకోరు. నమ్మలేకపోతున్నారా అయితే, ఒకసారి ప్రయత్నించిచూస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుస్తుంది. అవేంటంటే
టైం మిగులుతుంది 

 ఆలస్యంగా నిద్రలేస్తే పనులన్నీ పరుగులు తీస్తూ చేసుకోవాలి. అలాంటప్పుడు అ రోజులో చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఆలోచించడానికి టైం ఉండదు. ధ్యాసంతా పనులు పూర్తి చేసుకుని ఎప్పుడు ఇంటి నుంచి బయటపడదామా? అనే ఉంటుంది. అదే ఐదింటికి లేస్తే పనులన్నీ అయిపోయినా ఇంకా చాలా టైం మిగిలిపోతుంది. అ టైంలో ఈ రోజు చెయ్యాల్సిన పనులేంటి? దీనికి ఎంత టైం ఇవ్వాలి. ఏ పనికి ప్రయారిటీ ఇవ్వాలి అని నిర్ణయించుకుంటే పనులు సులభంగా చేసుకోవచ్చు.

రివైజ్ చేసుకోవచ్చు...
ఐదు గంటలకే నిద్రలేవడం వల్ల మనకోసం మనం కేటాయించుకునేందుకు కొంత టైం దొరుకుతుంది. ఆ టైంలో మనం చేసిన తప్పొప్పులు గురించి రివైజ్ చేసుకోవచ్చు. చాలామంది ఎప్పుడూ రోజువారి పనుల్లో బిజీగా ఉంటారు. మిగతా టైం సోషల్ మీడియాలో గడుపుతారు.  పుస్తకాలు చదవాలనే ఇష్టం ఉన్నవాళ్ళు కూడా టైం లేక చదవలేకపోతున్నారు.

 సంవత్సరంలో ఒక్క పుస్తకం కూడా చదవనీ వాళ్లు చాలామంది ఉన్నారు. అదే ఉదయం త్వరగా నిద్రలేచి కొంత టైంని మంచి పుస్తకాలు చదవడానికి కేటాయిస్తే సంవత్సరంలో 50కి పైగా పుస్తకాలు చదవొచ్చు. దాని వల్ల ఎంతో జ్ఞాసం వస్తుంది. పుస్తకాలు చదవడం బో ఫీట్ అయ్యేవాళ్ళు ఆడియో బుక్స్ డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు. ఇలా చేస్తే ముప్పై రోజుల్లోనే మార్పును గమనించవచ్చు. దానివల్ల మానసిక స్థితిలో కూడా చాలా మార్పులు వస్తాయి. మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు.

చెప్పాలంటే ముందు చెయ్యాలి...
ప్రతి ఉదయం నిద్రలేచి ఇంట్లోవాళ్లకి ఆదర్శంగా ఉండడం వల్ల వాళ్లపై మన నైతిక అధికారం వచ్చినట్లే అదెలా అంటే ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు మనం చెయ్యాలి అంటుంటారు పెద్దలు. అలాగే ఉదయమే లేచి పనులన్నీ చక్కబెట్టుకుంటే మనం ఏదైనా చెప్పినా అవతలి వాళ్లు వింటారు. అదే మనమే ఏడు గంటలకు లేస్తే పిల్లలు ఇంకెప్పుడు లేవాలి. ఒకబ్బాయి ఇంట్లో రోజూ స్పీట్లు తినేవాడు. అది చూసిన తండ్రి వాళ్ల టీచర్ కు కంప్లైంట్ చేశాడు. ఆ టీచర్ అబ్బాయిని మందలించకుండా రెండు వారాల తర్వాత మళ్లీ రమ్మని చెప్పి పంపాడు.

 ఈ సారి వచ్చినప్పుడు ఆ టీచర్ పిల్లాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అప్పటినుంచి పిల్లాడు స్వీట్లు తినడం మానేశాడు. ఇదంతా చూసిన ఆ అబ్బాయి వాళ్ల వాన్న ఈ పని నేను మొదటి సారి మీదగ్గరకి వచ్చినప్పుడే చెయ్యొచ్చు కదా అని అడిగాడు. అందుకు టీచర్ అప్పుడు నాకు కూడా స్వీట్లు తినే అలవాటు ఉండేది. నేను పాటించకుండా ఇతరులకు చెప్పడం కరెక్ట్ కాదు కదా అందుకే చెప్పలేదు అన్నాడు. ఈ కథ ద్వారా మనం అర్దం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఆదర్శంగా ఉంటే ఇతరులకు చెప్పే హక్కు ఉంటుంది. అప్పుడే వాళ్లపైన మనకు నైతిక అధికారం  వస్తుంది.

కాన్ఫిడెన్స్ పెరుగుతుంది...
ఉదయమే నిద్ర లేవడం వల్ల పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. దానివల్ల ఆటోమేటిక్​ కాన్పిడెన్స్ వస్తుంది అంటున్నారు నిపుణులు. 5గంటలకే నిద్రలేవడం వల్ల పని చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది. దాంతో ప్రతి పనినీ శ్రద్దతో చేస్తారు. అన్ని పనులూ మంచి ఫలితాలను ఇస్తాయి. అది ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ గోల్స్ చేరుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు దాని వల్ల మోటివేషన్ కూడా పొందుతారు. ఆ మోటివేషన్ గొప్పగా తీర్చుదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఎక్కువ డబ్బు...
ఉదయం త్వరగా లేవడం వల్ల ఎక్కువ డబ్బు రావడం ఏంటి అనుకుంటున్నారా అవును వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం బెంజిమన్ ఫ్రాంక్లిన్ కూడా ఒక సందర్భంలో 'త్వరగా పడుకుని, త్వరగా లేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు ఆస్తి సంపాదించుకోవచ్చు' అన్నారు. అంటే త్వరగా నిద్రలేచి త్వరగా పనులు చేసుకుంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి బోలెడు టైం ఉంటుంది. దాంతో కొత్త ఆలోచనలు వస్తాయి. వాటికి కార్యరూపం ఇస్తే డబ్బు వస్తుందని అర్థం. దాంతో మనం ఇప్పుడు అనుభవిస్తున్న లైఫ్ కంటే మెరుగైన లైఫ్ ఉంటుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies