Type Here to Get Search Results !

Sports Ad

తిరుమలలో టాలీవుడ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న కలర్ ఫోటో డైరెక్టర్ ఫోటోలు వైరల్ The Photos Of The Color Photo Director Who Married The Tollywood Heroine In Tirumala Have Gone Viral

తిరుమలలో టాలీవుడ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న కలర్ ఫోటో డైరెక్టర్ ఫోటోలు వైరల్

 Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : సుహాస్ నటించిన 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj) ఓ ఇంటివాడయ్యాడు. పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన చాందిని రావు (Chandini Rao) అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

 నవంబర్ 11న గ్రాండ్‌గా వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఇవాళ శనివారం (డిసెంబర్ 7న) తిరుమల వేదికగా చాందిని రావుతో దర్శకుడు సందీప్ రాజ్ వివాహం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఇరువురి పెద్దల సమక్షంలో ఒక్క‌ట‌య్యిన ఈ జంటకు సెలబ్రేటిస్ విషెష్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

 కాగా వీరి వివాహ వేడుకకు వైవా హర్ష, రోషన్ మరియు హీరో సుహాస్ త‌న ఫ్యామిలీతో క‌లిసి హాజ‌ర‌య్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ రాజ్ తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.

 ఇక చాందిని రావు సినిమాల విషయానికి వస్తే కలర్ ఫొటో, ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’తో పాటు రణస్థలి, రంగస్థలం సినిమాల్లో నటించింది.ఫేమస్ వెబ్ సిరీస్ పెళ్లి గోల సీజన్ 2లోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 సందీప్ రాజ్ సినిమాల విషయానికి వస్తే ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్‌ చేసి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. సందీప్ డైరెక్ట్ చేసిన కలర్ ఫోటో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇటు మ్యూజికల్ గా, అటు కమర్షియల్గా మంచి హిట్ అయ్యింది. అంతేగాకుండా సందీప్ రాజ్కి నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. కాగా ప్రస్తుతం సుమ కనకాల తనయుడు రోషన్ కనకాలతో 'మోగ్లీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies