న్యూఇయర్ వేడుకలపై పోలీస్ కండీషన్స్ గైడ్‌లైన్స్ విడుదల
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న నిర్వహించే ఈవెంట్స్‌కు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. పోలీసులు ఆంక్షలకు అనుగుణంగా నిర్వహించే వేడుకలకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు.
అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం గైడ్‌లైన్స్ జారీ చేశారు.
త్రీస్టార్ హోటల్స్, పబ్స్, బార్లు, రెస్టారెంట్స్‌లో నిర్వహించే వేడుకలకు అనుమతులు తప్పనిసరి చేశారు. ఇందుకోసం 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈవెంట్స్ నిర్వహిచే ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
న్యూఇయర్ సెలబ్రేషన్ గైడ్‌లైన్స్...
* హోటల్స్, పబ్, క్లబ్ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి.
* ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్స్, పార్కింగ్ ప్లేసెస్‌లో సీసీ టీవీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలి.
* పరిమితికి మించి పాసెస్ అమ్మకాలు, టికెట్స్, కూపన్స్ ఇవ్వరాదు. మైనర్స్‌కు ఇలాంటి పార్టీల్లో అనుయమతి లేదు.
* సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ మానిటరింగ్ చేయాలి.
* మ్యూజికల్ ఈవెంట్స్ ఇండోర్‌లో మాత్రమే జరుపుకోవాలి.
* 45 డెసిబుల్స్‌కి మించి సౌండ్ పొల్యూషన్ ఉండరాదు.
* రాత్రి 10 గంటల వరకు మ్యూజిక్ నిలిపివేయాలి.
* అసభ్యకర డ్యాన్సులకు, డ్రెస్సింగ్‌ను అనుమతించరాదు.
* డ్రగ్స్, మత్తు పదార్థాల యాక్టివిటీ చేసే నిర్వాహకులపై చర్యలు.
* వెహికల్ మూవ్‌మెంట్, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
* డ్రంకెన్ కండిషన్‌లో ఉన్న వారు వెహికల్ డ్రైవ్ చేయకూడదనే సైన్ బోర్డులు పెట్టాలి.
* పర్మినెంట్‌గా రద్దు చేస్తాం.
* ఈవెంట్స్ పరిసర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, షీ టీమ్స్ నిఘా పెడతాయి.
* మహిళలను వేధించే వారిని స్పాట్‌లోనే అరెస్ట్ చేస్తాయి.