SBI లో స్పెషల్ ఆఫీసర్స్ జాబ్స్ జీతం రూ.48 వేల నుంచి రూ.85 వేలు
జాతీయ National News భారత్ ప్రతినిధి : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 169 అసిస్టెంట్ మేనేజర్ నియామకాలకు అప్లికేషన్స్ కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్ విధానం తెలుసుకుందాం.
వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలనేది నిరుద్యోగుల కల. మంచి జీతం, తక్కువ సమయంలోనే ప్రమోషన్స్, ఆకర్షణీయమైన అలవెన్స్‌లు బ్యాంక్ ఎంప్లాయీస్‌కు ఉంటాయి. డిగ్రీ విద్యార్హతతో భద్రమైన బ్యాంక్ కొలువులో స్థిరపడేందుకు నిరుద్యోగులకు మంచి అవకాశం ఈ నోటిఫికేషన్‌తో దొరికింది. ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటరాక్షన్ ఆధారంగా; అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్-ఫైర్) పోస్టులకు అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటరాక్షన్‌కు 25 మార్కులు ఉంటాయి.
సిలబస్ రీజనింగ్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు లాజికల్‌గా ఆలోచించి రాసేలా ఉంటాయి. క్వశ్చన్ ప్యాటర్న్ విశ్లేషిస్తే దాదాపు సమాధానం రాబట్టవచ్చు. నాలుగైదు సంవత్సరాలకు చెందిన అన్ని బ్యాంకు ప్రీవియస్ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను, వాటి మెథడ్స్ ప్రాక్టీస్ చేయాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, కోడింగ్–డీకోడింగ్, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌ల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఆయా టాపిక్‌ల్లో ఉన్న అన్ని మోడల్స్, మెథడ్స్ చదవాలి.
వీటితోపాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్ వంటి వర్బల్ రీజనింగ్ టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్‌మెంట్-ఇన్‌ఫరెన్స్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, ప్యాటర్న్ కంప్లిషన్, ఎంబెడ్డెడ్ ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్ రీజనింగ్ అంశాలు ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన సబ్జెక్ట్ ప్రిపరేషన్ సమయంలో ఫార్ములాలు, షార్ట్‌కట్స్ రాసుకొని సాధన చేస్తే తక్కువ సమయంలో ఆన్సర్ చేయచ్చు. ఈ విభాగంలో గత పరీక్షల్లో ఎక్కువగా నంబర్ సిరీస్, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆర్థమెటిక్ టాపిక్‌ల నుంచి ప్రశ్నలిచ్చారు. కాబట్టి వీటిపై ఫోకస్ చేయడం ఎంతో అవసరం. అర్థమెటిక్ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నంబర్ సిరీస్, నంబర్ సిస్టం, సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం, రూట్స్ అండ్ క్యూబ్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ లో అన్ని మోడల్స్ చదవాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్: పెద్ద పెద్ద వ్యాసాలు వేగంగా చదివి అర్థం చేసుకోగలిగితే అత్యధిక మార్కులు పొందగలిగే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అని చెప్పవచ్చు. ప్యాసేజ్ ఆధారంగా దాదాపు 10 ప్రశ్నలిస్తారు కాబట్టి అందులోని సారాంశంను తెలుసుకుంటే అన్ని మార్కులు మీవే. ప్యాసేజ్‌లోని కష్టమైన పదాలకు అర్థాలు తెలిస్తే సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్ వంటి ప్రశ్నలకూ సమాధానాలు రాయవచ్చు. న్యూస్‌పేపర్స్, చానళ్లలో ఉపయోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిని పరిశీలించాలి.
ప్రిపరేషన్ ప్లాన్....
ఇప్పటికే బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అదే ప్రిపరేషన్‌తో ఈ పరీక్షను కూడా రాయవచ్చు. తాజాగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకునే వారు పరీక్ష సిలబస్‌ను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇచ్చిన సిలబస్‌లో బేసిక్ అంశాలతో ప్రిపరేషన్ మొదలు పెడితే.. అనంతరం ఆయా అంశాలపై పట్టు సాధించవచ్చు. ప్రిపరేషన్‌లో భాగంగా ఎక్కువగా మాక్ టెస్టులను రాయాలి.
వీలైనన్ని మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి మార్కులు సాధించడమే కాకుండా నిర్ణీత సమయంలో వేగంగా సమాధానాలు గుర్తించడానికి సన్నద్ధత లభిస్తుంది. కష్టమనిపించే అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. మాక్ టెస్టుల్లో చేసే తప్పులను గుర్తించి అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ మార్కులు సాధించేందుకు తక్కువ సమయంలో సమాధానం గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి. ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి షార్ట్‌కట్ మెథడ్స్‌ను అనుసరించాలి. గత పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలతోపాటు వీలైనన్ని ఎక్కవ మాక్‌టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులను రాయాలి. దీని ద్వారా ఆయా అంశాలపై ఏ మేరకు అవగాహన ఉందో తెలుస్తుంది. ఇంగ్లీష్ సబ్జెక్టులో ముఖ్యంగా గ్రామర్ మీద ఫోకస్ చేయాలి. వొకాబులరీ కోసం ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చదవాలి. సివిల్ లేదా ఎలక్ట్రికల్ సబ్జెక్టుల నుంచి బేసిక్స్ అంశాల మీద దృష్టి పెట్టాలి.
నోటిఫికేషన్....
ఖాళీలు: మొత్తం 169 ఖాళీల్లో అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 42, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఎలక్ట్రికల్): 25, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్): 101, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 1 పోస్టు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు: బీఈ/ బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఫైర్/ సేఫ్టీ & ఫైర్ ఇంజినీరింగ్/ ఫైర్ టెక్నాలజీ & సేఫ్టీ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు చెల్లిస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. పూర్తి వివరాలకు www.bank.sbi వెబ్సైట్లో సంప్రదించాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్
సబ్జెక్ట్: మార్కులు
రీజనింగ్: 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 35
ఇంగ్లీష్: 35
సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 100