తెలంగాణ తల్లి కొత్త రూపం కొత్త విగ్రహం ఇలా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బంగారు రంగు అంచుతో ఉన్న ఆకుపచ్చని చీర, ఎడమ చేతిలో వరి కంకి, మొక్క జొన్న కంకి, సజ్జ కంకి, చేతికి, మెడలో తీగ, ఆకుపచ్చ గాజులు, పోరాట స్ఫూర్తిని తెలిపేలా పిడికిళ్లతో తెలంగాణ తల్లి కొత్త విగ్రహం చూడ ముచ్చటగా ఉంది.
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రత్యేకతలివే....
* ఆకుపచ్చని చీర
* ఎడమ చేతిలో వరి కంకి, మొక్క జొన్న కంకి, సజ్జ కంకి
* మెడలో తెలంగాణ పల్లె ఆడపడుచులు ధరించే తీగ
* చేతికి ఆకుపచ్చ గాజులు
* బంగారు రంగు అంచు ఆకుపచ్చ చీర
* పోరాట స్ఫూర్తిని తెలిపేలా బిగించిన పిడికిళ్లు
* అభయహస్తంతో తెలంగాణకు ఆశీస్సులు
* నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టు
* చెవికి కమ్మలతో తెలంగాణ తల్లి విగ్రహం