వారంటే నాకు పిచ్చి ఇప్పటివరకు ఇలా ఏ ఇండియన్ సినిమా రాలేదు
Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ‘పుష్ప 2’ (Pushpa 2) పై డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (డిసెంబర్ 2న) రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డైరెక్టర్ రాజమౌళి విచ్చేశారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. " పుష్ప పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదేలే అంటూ స్టార్ట్ చేసి పుష్ప 1 మూవీ రిలీజ్ అప్పుడు చెప్పాను తగ్గేదే లేదని. అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయే సరికి అందరూ అడిగేవాళ్లు. ఆ సినిమా అయిపోయిటప్పటికీ పుష్ప 2 స్టోరీ వినలేదు కానీ పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అని చెప్పేవాడిని అని అల్లు అర్జున్ అన్నారు. ఇక ఈ అల్లు అర్జున్ అనేవాడు ఉన్నాడంటే అందుకు కారణం డైరెక్టర్ సుకుమార్ అని అతను లేనిదే నేను మీ ముందుఉండేవాడ్ని కానని బన్నీ చెప్పుకొచ్చారు.
ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ 'నేనెప్పుడూ ఫ్యాన్స్‌ను ప్రేమిస్తూనే ఉంటాను. వారంటే నాకు పిచ్చి. వారికోసం ఎంత కష్టమైనపడటానికి నేను ఎప్పుడు సిద్ధం అని పుష్పా పై చూపిస్తున్న ఆదరణకు ఋణపడి ఉంటానని అల్లు అర్జున్ తెలిపారు. మూడేళ్ల క్రితం ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరందరూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మా సొంత ఫంక్షన్ లో మీ అందరినీ కలుస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇక మాపై నమ్మకంతో ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. మమ్మల్ని ఎంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు కుమ్మరించినందుకు థ్యాంక్స్. యాక్టర్ ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. ఫస్టాఫ్ అయిన తర్వాత మీరంతా తన నటనకి స్టన్ అవుతారు.
అలాగే డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల డ్యాన్స్ చూస్తే, భలే క్యూట్‌గా ఉందనిపిస్తుంది. ఆమెతో పనిచేసిన తర్వాత తన టాలెంట్ ఏంటో తెలిసింది. ఇక నా శ్రీవల్లి అంటూ నేను ఐదేళ్లుగా శ్రీవల్లితో పనిచేస్తున్నా. షూటింగ్‌లో ఆమె లేని రోజులు అసలు ఊహించలేను. రాత్రి 2గంటల వరకూ ‘పీలింగ్స్’ సాంగ్ చేసి, మళ్లీ ఉదయాన్నే ఎనిమిదిన్నరకు వచ్చేసేది. వరుసగా రెండు రోజుల పాటు సరిగా నిద్రకూడా పోలేదు. ఇలాంటి అమ్మాయిలతో పనిచేయాలన్న ఫీలింగ్ కలిగించింది అన్నారు.
ఇకపోతే ఈ సినిమా ఆడాలని ముఖ్యంగా మూడు సార్లు అనుకున్నాను. అందులో మొదటిది ఒక్కో సీన్ కోసం తపన పడే సుకుమార్ కోసం, రెండోది రాత్రియంబవళ్ళు సినిమా మంచిగా రావడం కోసం శ్రమిస్తున్న అందరి టెక్నీకల్ టీమ్ కోసం అని చెప్పారు. ఇక ఇండియా వైడ్గా ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకుల కోసం ఆడాలని కోరుకుంటున్న అన్నారు అల్లుఅర్జున్. ఇప్పటివరకు 12వేల స్క్రీన్‌లలో ఏ ఇండియన్ సినిమా రాలేదు. చాలా గర్వంగా ఉంది. నా ఆర్మీ (అభిమానులు)కి థ్యాంక్స్. నా కష్టం నా అభిమానులకు అంకితం.