రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం ఇంత సింపులా ఓసారి ట్రై చేయండి
Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : రోజువారి పనులు, లక్ష్యాలు ఒత్తిడికి గురిచేస్తుం టాయి. దాంతో చిరాకు వస్తుంది. అలసటతో పనులు సరిగ్గా చేయలేం. మరి రోజంతా ఉల్లా సంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఏంచేయా లంటే నిద్రలేచిన దగ్గర్నుంచీ ఎన్నో పనులతో సతమతమవుతుంటారు చాలామంది. రోజంతా ఉత్సాహంగా పని చేయాలన్నా, ఆరోగ్యంగా ఉం డాలన్నా ప్రతిరోజూ పొద్దున్నే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటితోపాటు చేయకూడనివి ఉన్నాయి.
నిద్ర లేవగానే పనుల్లో పడిపోతుం టారు చాలామంది. ఇది సరైంది కాదు. శరీరం చురుగ్గా ఉండాలన్నా, శక్తిస్థాయిలు పెరగాలన్నా.. కొద్దిపాటి వ్యాయామం తప్పనిసరి. అందుకే రన్నింగ్, యోగా ఇలా ఏదో ఒకటి చేయాలి. స్టై చింగ్ వ్యాయామాలు చేసినా మంచిదే. ఉదయా న్నే మొబైల్, టాబ్లెట్ చూసే అలవాటు ఉంటే, వెంటనే మానుకోవాలి. ఎందుకంటే ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ లను నిద్రలేచిన వెంటనే చూడటం వల్ల, ఆలోచనలు కూడా ఆ విషయాల చుట్టే తిరుగుతుంటాయి. ప్రశాంతతను దూరం చేసి చిరాకు తెప్పిస్తుంది.
నిద్రలేచిన తర్వాత కప్పు కాఫీ, బ్రెడ్ లాంటివి తీసుకుంటుంటారు. వీటివల్ల రోజంతా శరీరానికి శక్తి అందదు. శరీరంలో నెమ్మదిగా విడుదలయ్యే పిండి పదార్థాలు, పీచులాంటి ఆహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఓట్ మీల్స్ లో పండ్లు, నట్స్ వేసుకుని తినడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. కొందరు నిద్రలేచాక కాఫీ తాగుతూ టీవీ ముందు కూర్చుంటారు. అలా మనకు తెలియకుండానే మిగిలిన పనులు వాయిదా వేస్తాం. దాంతో ఆందోళన పెరిగిపోతుంది. ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటే రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు.