తెలంగాణలో కొత్తగా రెండు ఆర్టీసీ బస్సు డిపోలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో కొత్తగా మరో రెండు ఆర్టీసీ బస్సు డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో ఒక్క బస్సు డిపో కూడా ఏర్పాటు కాలేదన్నారు. సీఎం రెవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీజీఎస్ ఆర్టీసీని అభివృద్దిపథంలో నడిపిస్తున్నామన్నారు.
గడిచిన పదిహేనేళ్లలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్న టీజీఎస్ ఆర్టీసీని లాభాల బాటలో ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్తగా ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీలో సంస్కరణలతో అనేక కార్మిక సంక్షేమం, ప్రజల సౌకర్యం కొరకు కృషి చేస్తున్నామన్నారు.
కొత్తగా ములుగు, పెద్దపల్లి జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పెద్దపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో రెండు ఈ బస్సు డిపోలు ఏర్పాట చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఈ రెండు ఆర్టీసీ డిపోలకు ఆర్డర్లు వచ్చాయన్నారు.
నూతన ఉద్యోగ నియామకాలు, నూతల బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు ,కార్మికుల సంక్షేమం ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి ములుగు జిల్లా లోని ఏటూరు నాగారంలో రెండు నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు కొత్త డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందుస్తామన్నారు. త్వరలోనే బస్సు డిపోల నిర్మాణం ప్రారంబిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.