Type Here to Get Search Results !

Sports Ad

మాలల ఆత్మ గౌరవం ఐక్యతను చాటి చెప్పాం We Have Expressed The Self Respect And Unity Of The Garlands

మాలల ఆత్మ గౌరవం ఐక్యతను చాటి చెప్పాం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మాలల సింహగర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. సింహ గర్జన సభ ద్వారా మాలల ఆత్మ గౌరవాన్ని, ఐక్యతను చాటి చెప్పామని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలల హక్కుల సాధన కోసం 2024, డిసెంబర్ 1వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‎లో పెద్ద ఎత్తున మాలల సింహ గర్జన సభ నిర్వహించారు. 

 చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మాలలు తరలివచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ జన సంద్రోహమైంది. ఈ సభకు మాజీ కేంద్ర మంత్రి పాశ్వాన్, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, నాగరాజు, ఎంపీ గడ్డం వంశీ తదితరులు  హాజరయ్యారు. వర్గీకరణ పేరుతో ఎస్సీలను విడదీసే కుట్ర చేయొద్దంటూ ఈ వేదిక సాక్షిగా మాలల పునరుద్ఘాటించారు.

 ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ మాలల సింహా గర్జన మీటింగ్‎ను ఎంతో మంది అవహేళన చేశారు కానీ సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాల నుండి పెద్దఎత్తున తరలివచ్చి సభను సక్సెస్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్నారు. మాలల సింహా గర్జన సభకు ఇంత జనం హాజరవుతారని ఎవరూ ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు. మన ఆత్మ గౌరవాన్ని మనమే కాపాడుకోవాలన్న ఎమ్మెల్యే వివేక్ మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఇవాళ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఆదివారం (డిసెంబర్ 1) హైదరాబాద్‎లోని పరేడ్ గ్రౌండ్స్‏లో పెద్ద ఎత్తున తలపెట్టిన మాలల సింహ గర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. ఈ దేశంలో 3 వేల ఏండ్ల నుంచి కుల వివక్ష కొనసాగుతోందని దళితులకు ఫ్రీడం రావాలని అంబేద్కర్ ఆలోచించారని అన్నారు. కుల వివక్ష చూసే అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు కల్పించారని కానీ ఇవాళ ఆ రిజర్వేషన్లన్నీ ఎత్తివేసే కుట్ర జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. 

ముందు క్రిమిలేయర్ అంటారు ఆ తర్వాత రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు . మాలల బలమేమిటో ఈ సభ ద్వారా నిరూపించుకున్నామన్నారు. దళిత సమాజం గురించి అంబేద్కర్ ఆలోచించారు. తన తండ్రి కాకా వెంకటస్వామి దళితుల కోసం పోరాటం చేశారు అందులో మాల, మాదిగ చూడలేదు. ఇప్పుడు కాకా అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నానని అన్నారు. 

 మాలలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వివేక్ మాలలపై దుష్ప్రచారం చేస్తే సహించమని హెచ్చరించారు. అంబేద్కర్ ను విమర్శిస్తే మాలలు ఊరుకోరు ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. మాలలు అంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మాలలు తక్కువగా ఉన్నారని ఇన్నాళ్లు భావించారు. ఈ సభకు వచ్చిన జనమే అలాంటి వాళ్లకు చెంపచెట్టులాంటిదన్నారు. 

 రాజకీయ పార్టీల్లో మాలల పట్ల చిన్నచూపు ఉందని అలాంటి రాజకీయ పార్టీలకు చెంపపెట్టు మన ఈ మాల సభ అన్నారు. మంత్రి పదవి కోసం మాలల పోరాటం చేస్తున్నామని కొందరు అంటున్నారు. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం  చేశారు. గతంలో కేసీఆర్‎కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎన్నో పదవులు ఇస్తాం అంటూ ఆఫర్  వచ్చాయని కానీ అన్నింటినీ తృణపాయంగా విడిచి పెట్టానని చెప్పారు. మాలల కోసం పోరాటం చేస్తోన్న తనపై ఈడీ దాడులు చేసిన వెనక్కి తగ్గలేదని తేల్చి చెప్పారు. మీ అందరికి మేము అండగా ఉన్నామని మాలలకు భరోసో కల్పించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies