Type Here to Get Search Results !

Sports Ad

ముఖ్యంపై నల్ల మచ్చలు ఎందుకొస్తాయి ట్రీట్ మెంట్ ఏంటీ నల్లమచ్చలు రాకుండా ఈ జాగ్రత్తలు What Causes Black Spots On The Skin

ముఖ్యంపై నల్ల మచ్చలు ఎందుకొస్తాయి ట్రీట్ మెంట్ ఏంటీ నల్లమచ్చలు రాకుండా ఈ జాగ్రత్తలు

Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : మెలాజ్మా అనేది ఒక చర్మ సమస్య. చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. దీనివల్ల చర్మంపై నల్లమచ్చలు వస్తుంటాయి. ఎక్కువగా ముఖంపైనే ఈ మచ్చలు కనిపిస్తాయి. చెంపలపై, ముక్కుపై, సుదురు భాగంలో నల్లమచ్చలు ఎక్కువ వస్తాయి. సూర్యరశ్మికి ఎక్స్ పోజ్ అయ్యే చర్మమంతటా నల్లమచ్చలు వచ్చే ప్రమాదం ఉంది. ఆసియా దేశంలోని వాళ్లకే వస్తున్న ఈ చర్మ సమస్య.. ఆడవాళ్లలో ఎక్కువ కనిపిస్తుంది. 10% మగవాళ్లు కూడా నల్లమచ్చలతో ఇబ్బంది పడుతున్నారు.

ఎందుకొస్తుంది...
చర్మంపై నల్ల మచ్చలు ఎందుకొస్తాయన్న దానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా, స్పష్టమైన కారణం ఇదీ అని ఇంకా కనుక్కోలేదు. హార్మోన్లలో వచ్చే మార్పులు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నల్లమచ్చలు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ప్రమాదమేమీ లేకున్నా, చర్మంపై కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చలు కావడంతో, చాలామంది వీటిని చూసుకుని చికాకు పడుతుంటారు.

కనిపిస్తున్న కారణాలు...
* చర్మం సూర్యరశ్మికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం.
* థైరాయిడ్ సమస్యతో బాధపడు తుండటం.
* గర్భిణీగా ఉన్నప్పుడు, కాంట్రా సెప్టివ్ పిల్స్ వాడుతున్నప్పుడు హార్మోన్లలో వచ్చే మార్పులు,
* స్కిన్ ప్రాడక్ట్లు ఎక్కువ వాడటం.
* 30% మందికి ఈ సమస్య వార సత్వంగా కూడా వస్తోంది.

గుర్తుపట్టడం ఎలా...
నల్లమచ్చలు కొన్ని అప్పటికప్పుడు వచ్చి పోయేవి ఉంటాయి. కొన్ని అలా ఉండిపోతాయి. నల్లమచ్చల స్థాయి ఏంటి? ఎంతలా వ్యాపించా యన్నది సరిగ్గా తెలుసుకోవడానికి డెర్మటాలజిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. చర్మం తీరును బట్టి నల్లమచ్చలు మెలాజ్మానా కాదా నిర్ణయిస్తారు. ఫుడ్స్ లైట్ అనే పరికరం వాడి నల్లమచ్చల తీవ్రతను తెలుసుకోవచ్చు.

ట్రీట్మెంట్ ఉందా...
మెలాజ్మాకు ట్రీట్మెంట్ ఉంది. టోపికల్ స్కిన్ లైటెనింగ్ థెరపీనే దాదాపుగా ఎక్కువమంది ట్రీట్మెంట్ వాడుతున్నారు. కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్మెంట్ కూడా. అందుబాటులో ఉన్నాయి.

గర్భిణీలలో ఎక్కువ...
నల్లమచ్చలు గర్భిణీలను బాగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్య, 'ది మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ' అని ఈ సమస్యను పిలుస్తుంటారు. అంతలా ఇది ఒక మహిళ గర్భిణీగా ఉన్న రోజుల్లో పట్టుకుంటుందన్నమాట. చర్మంపై నల్ల రంగు (లేదా ముదురు గోధుమరంగు) తో ఒక పూత పూసినట్టుగా ఈ నల్లమచ్చలు పేరుకుంటాయి. హార్మోన్లలో వచ్చే తేడా ఈ చర్మ సమస్యకు ఒక కారణం.

నల్లమచ్చలు రాకుండా...
నల్లమచ్చలు చర్మంపై కనిపించడం వల్ల చాలామంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. అందంగా కనిపించాలని కోరుకోని వాళ్లు కూడా చర్మంపై నల్లమచ్చలు రావడం ఇబ్బందిగా చూస్తున్నారు. 

ఇవి రాకుండాఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించవచ్చు అవి...
* రోజూ సన్ స్క్రీన్ వాడాలి.
* సూర్యరశ్మి చర్మంపై పడకుండా దుస్తులు వేసుకోవాలి. అవసరమైనప్పుడు గొడుగు, టోపీ వాడితే మంచిది.
* చర్మానికి పడే స్కిన్ కేర్ ప్రొడక్లనే వాడాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies