జనవరి25 నుంచి హైదరాబాద్లో వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : జనవరి26న హైదరాబాద్లో వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నారు. రిపబ్లిక్ డే రోజున ఉదయం 10.30 గంటలకు బంజారాహిల్స్ లోని హయత్ ప్లేస్ హోటల్ లో నిర్వహించనున్నారు. ప్రముఖ ఇండియా ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ Edwise ఆధ్వర్యంలో వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.
ప్రముఖ విదేశీ విద్యా కన్సల్టెంట్‌లు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీల ప్రతినిధులు వస్తారు. అడ్మిషన్లు, స్కాలర్ షిప్ లు, అప్లికేషన్లు, ఫీజుల వంటి అంశాలపై సలహాలు, ఆన్-ది-స్పాట్ ఆఫర్లు, అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది. కోర్సులు, వీసా, స్కాలర్‌షిప్‌లు, లోన్లు మొదలైన వాటి గురించి విద్యార్థుల సందేహాలకు ఈ డెలిగేట్‌లు సమాధానం ఇస్తారు.