ఐటీ కంపెనీ ఎదుట నిరుద్యోగుల పరేడ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకు 3 వేల మంది
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : భారతదేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ఉద్యోగం కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అనటానికి ఈ ఘటనే నిదర్శనం. పూణెలోని ఓ ఐటీ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్యూకు నోటిఫికేషన్ వేసింది. అది కూడా రిపబ్లిక్ డే రోజు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఓ 100,, 200 మంది లేదా మహా అయితే 500 మంది వస్తారని అంచనా అంతకు మించి ఊహించని విధంగా ఏకంగా 3 వేల మంది వచ్చారు.
అంతే ఐటీ కంపెనీ చుట్టూ ట్రాఫిక్ జాం నిరుద్యోగుల పరేడ్ గా మారిపోయింది ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో పరేడ్ జరుగుతుంటే పూణెలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం పరేడ్ చేస్తున్నారని దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఇది చాలు అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ఇంతకీ ఈ ఇంటర్వ్యూ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పుణెలోని మగర్ పట్టాలో ఉన్న యుపీఎస్ అనే ఐటీ కంపెనీ 100 ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం ( జనవరి 26, 2025 ) వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు నోటిఫికేషన్ ఇచ్చింది అసలే ఆదివారం పైగా పబ్లిక్ హాలిడే కావడంతో నిరుద్యోగులు, జాబ్ చేంజ్ అవ్వాలని చుస్తున్నోళ్లు పెద్ద ఎత్తున ఈ వాక్ ఇన్ కి అటెండ్ అయ్యారు. 100 ఉద్యోగాల కోసం ఏకంగా 3వేల మంది అటెండ్ అవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 3000 వేల మంది, అందరూ బీటెక్ చేసినోళ్లే ఉద్యోగం కోసం ఐటీ కంపెనీలో ఉద్యోగం కోసం ఆఫీసు బయట బారులు తీరారంటే మన దేశంలో నిరుద్యోగిత ఏ రేంజ్ లో ఉందో మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు.
ఇందుకు సంబందించిన వీడియో 24 గంటలలోనే 2 లక్షల వ్యూస్, 2 వేలకు పైగా లైక్స్ తో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ రేంజ్ లో నిరుద్యోగం ఉందంటే ఇండియాలో పిల్లలను చదివించడం వేస్ట్ అని పిల్లల చదువుల మీద తల్లదండ్రులు చేస్తున్న ఖర్చు మొత్తం వృధా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ వీడియో చూస్తే ఇండియాలో యూత్ కి ఫ్యూచర్ లేదని డిగ్రీలు చదువుతున్నారు తప్ప ఒక్కరికి కూడా సరైన స్కిల్స్, ప్లానింగ్ వంటివి లేవని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.