ఎలా పడుతున్నార్రా పులి మూత్రం కీళ్లనొప్పులను తగ్గిస్తుందంట బాటిల్ 600 రూపాయలు
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఏం వింతలు విడ్డూరాలో దేనికైనా ఓ లిమిట్ ఉండాలి అంటారు పెద్దలు ఇప్పుడు అది అన్ లిమిటెడ్ అయిపోయింది వైద్యం కూడా వ్యాపారం అయిపోయిన రోజు ల్లో అంతరిక్షాన్ని జయిస్తున్న ఈ రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలను బలంగా జనంలోకి తీసుకెళ్లటం అనేది మాత్రం వింతనే విడ్డూరమే ఇప్పుడు మార్కెట్ లో కొత్త గా పులి ఉచ్చ మూత్రం అమ్మకాలు వచ్చాయి బాటిల్ 600 రూపాయలు అంట.
అది కూడా జూలోని పులి నుంచి వచ్చిన మూత్రం అంట చైనా దేశంలోని జూ లోనే స్పెషల్గా అమ్ముతున్నారంట అసలు పులి మూత్రాన్ని బాటిల్లో ఎలా పడతారు అనేది క్వశ్చన్ అయితే ఈ పులి మూత్రంతో కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, కండరాల నొప్పులు ఇట్టే మాయం అవుతుందని జూ అధికారులు చెప్పటం విడ్డూరంగా లేదు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్ నడుస్తుంది.
ఇదో రకం దోపిడి. సిచువాన్ ప్రావిన్స్‌లో యాన్ బిఫెంగ్జియా వైల్డ్‌లైఫ్ జూపార్కులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, బెణుకులు ,కండరాల నొప్పులకు నివారణగా సీసాలో ఉంచిన టైగర్ మూత్రాన్ని విక్రయిస్తోంది.
పులి మూత్రాన్ని బాటిల్ రూ. 596కు అమ్ముతున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూత్రం ఆర్థరైటిస్, కండరాల నొప్పి ,బెణుకులు వంటి వ్యాధులను నయం చేస్తుందని జూ నిర్వాహకులు చెబుతున్నారు.
అయితే ఏ శాస్త్రవేత్త కూడా దీనిని ఆమోదించలేదు. నిపుణులు మూత్రాన్ని విక్రయించే పద్ధతిని అనైతిక ,ప్రమాదకరమైనదిగా ఖండించారు. ఇదో రకం మోసం అంటున్నారు నెటిజన్లు.