Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ లో అమెజాన్ AI క్లౌడ్ సెంటర్ 60 వేల కోట్ల పెట్టుబడితో ఒప్పందం Amazon AI Cloud Center In Hyderabad Is An Agreement With An Investment Of 60 Thousand Crores

 

హైదరాబాద్ లో అమెజాన్ AI క్లౌడ్ సెంటర్ 60 వేల కోట్ల పెట్టుబడితో ఒప్పందం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : దావో స్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ సంస్థ అమెజాన్ తెలంగాణలో   భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.  రాష్ట్రంలో డేటా సెంటర్లలో  60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 

 జనవరి 23న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సులో  సీఎం  రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్  మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు.  దాదాపు రూ. 60 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ  డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. 

 తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది.   ఒక బిలియన్ పెట్టుబడులతో  తెలంగాణలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి.  కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.  రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. 

 అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు  మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయన్నారు.  ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని ఐటీ మంత్రి  శ్రీధర్ బాబు అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies