Type Here to Get Search Results !

Sports Ad

బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు పెరిగిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ Balakrishna's Padma Bhushan Awarded Daku Maharaj Box Office Collections

బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు పెరిగిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : టాలీవుడ్ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ (Padma Bhushan) అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ 2025 ఏడాది బాలకృష్ణకు ఎంతో విశిష్టతను సంపాదించింది. జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రిలీజైన 8 రోజుల్లోనే రూ.156 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కంటిన్యూ అవుతుంది.

 అలాగే, భారత దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుతో బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. కళారంగంలో, సామాజిక సేవలోను ఆయన చేసిన సేవలకు గాను పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం. అయితే, ఈ అవార్డు ప్రకటించిన అనంతరం డాకు మహారాజ్ కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. వసూళ్లు ఏ రోజు ఎలా ఉన్నాయో ఒక లుక్కేయండి.

Sacnilk ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం....
అయితే, ఈ క్రమంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ కలెక్షన్స్ అమాంతం పెరుగుతున్నాయి. పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన మరుసటి రోజు నుంచి వసూళ్ల నెంబర్ జోరందుకుంది. జనవరి 24న శుక్రవారం (13వ రోజు) ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.0.8కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.  [తెలుగు: 0.75 Cr ; హిందీ: 0.05cr]. అంటే 23.81% వసూళ్లు వచ్చాయి. 

 జనవరి 25న శని వారం(14వ రోజు) బాక్సాఫీస్ దగ్గర రూ.1.05 కోట్ల షేర్ రాబట్టింది. [తెలుగులో: 1 Cr ; హిందీ: 0.05Cr ]. 31.25% వసూళ్లు వచ్చాయి. 
జనవరి 26న ఆదివారం 15వ రోజు బాక్సాఫీస్ దగ్గర రూ.1.65 కోట్ల షేర్ రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ 15 రోజుల్లో రూ.86.95కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. డాకు మహారాజ్ 1వ వారం మొత్తం కలెక్షన్: ₹66.4 కోట్లు.

డాకు మహారాజ్ రోజువారీ కలెక్షన్ చూసుకుంటే...
* 6వ రోజు [1వ శుక్రవారం] ₹ 4.2 కోట్లు
* 7వ రోజు [1వ శనివారం] ₹ 4 కోట్లు
* 8వ రోజు [2వ ఆదివారం] ₹ 3.75 కోట్లు
* 9వ రోజు [2వ సోమవారం] ₹ 1.6 కోట్లు
* 10వ రోజు [2వ మంగళవారం] ₹ 1.35 కోట్లు
* 11వ రోజు [2వ బుధవారం] ₹ 1.1 కోట్లు
* 12వ రోజు [2వ గురువారం] ₹ 1.05 కోట్లు
* 2వ వారం కలెక్షన్: ₹ 17.05 కోట్లు
* 13వ రోజు [2వ శుక్రవారం] ₹ 0.8 కోట్లు
* 14వ రోజు [2వ శనివారం] ₹ 1.05 కోట్లు.
* 15వ రోజు [2వ ఆదివారం] రూ.1.65 కోట్ల షేర్ రాబట్టింది. 

బాబీ లొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా మూవీలో బాలయ్య బాబు మూడు షేడ్లలో యాక్టింగ్ అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్సుల్లో మరోసారి తన సత్తా చూపించారు. థమన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సక్సెస్లో మరో హైలెట్ గా నిలిచింది. అలాగే థమన్ ఇచ్చిన మాస్ బీట్స్ కి బాలయ్య వేసిన మాస్ స్టెప్స్ కి ఆడియన్స్ ఈలలు వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies