Type Here to Get Search Results !

Sports Ad

BE/BTech అర్హతతో NTPCలో ఉద్యోగాలు నెలకు లక్ష రూపాయల జీతం Jobs In NTPC With BE/BTech Qualification Salary Rs.1 Lakh Per Month

BE/BTech అర్హతతో NTPCలో ఉద్యోగాలు నెలకు లక్ష రూపాయల జీతం

 జాతీయ National News భారత్ ప్రతినిధి : భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో BE/BTech డిగ్రీ ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. PGDM/MBA అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ.. 2025, ఫిబ్రవరి 4. ఆలోపు NTPC అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. 

మొత్తం ఖాళీలు: 8

విద్యార్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో BE/BTech డిగ్రీ కలిగి ఉండాలి. PGDM/MBA అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులే. కనీసం 5 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి. అదనపు వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

వయో పరిమితి: గరిష్ట వయోపరిమితి 38 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు వయో సడలింపు పొందుతారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. SC/ST/PwBD/ ExSM, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. 

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 1 లక్ష. (మూడేళ్లకు మిమ్మల్ని నియమించుకుంటారు. మీ పనితీరు ఆధారంగా ఆ గడువును మరో రెండేళ్లు పొడిగించవచ్చు)

ముఖ్య తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21/ 01/ 2025

దరఖాస్తులకు చివరి తేదీ: 04/ 02/ 2025

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies