Type Here to Get Search Results !

Sports Ad

బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీ అకౌంట్లో రైతుభరోసా డబ్బులు పడ్డయ్ Check The Balance Rythu Bharosa Money Has Been Deposited In Your Account

బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీ అకౌంట్లో రైతుభరోసా డబ్బులు పడ్డయ్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ వ్యాప్తంగా రైతుభరోసా సాయం కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా జనవరి 27న(అర్థరాత్రి) నుంచే రైతుల అకౌంట్లో ఎకరాకు రూ. 6 వేల చొప్పున  జమవుతున్నాయి.  రైతు భరోసా డబ్బులు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందంటున్నారు. డబ్బులు పడ్డ అకౌంట్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు పలువురు రైతులు.

 జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తధామరాజుపల్లికి చెందిన మామిడి రాజశేఖర్ ఖాతాలో రైతు భరోసా జమైనట్లు ఆ రైతు తనకు డబ్బులు పడినట్లు వచ్చిన ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ను మీడియాతో పంచుకున్నాడు. నాలుగు ఎకరాల 21 గుంటలకు 27,450 నగదు జమైనట్లు తెలిపాడు. ఈ డబ్బులు ఎరువులకు , వ్యవసాయ పనులకు వాడుకుంటానని ఆనందం వ్యక్తం చేశాడు. రైతు భరోసా డబ్బులు జమ చేసినందుకు రేవంత్ ప్రభుత్వానికి రైతు మామిడి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపాడు.

 జనవరి 26న నాలుగు స్కీంలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీం కింద వ్యవసాయ యోగ్యమైన  ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 12వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత కింద ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు జమ చేస్తుంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies