Type Here to Get Search Results !

Sports Ad

ఇందిరమ్మ ఇండ్లకు మారిన గైడ్ లైన్స్ పూర్తి వివరాలు ఇలా The Complete Details Of The Guidelines Changed For Indiramma Houses Are As Follows

ఇందిరమ్మ ఇండ్లకు మారిన గైడ్ లైన్స్ పూర్తి వివరాలు ఇలా

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏమూలకూ సరిపోవడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గరిష్టంగా పట్టణాల్లో రూ.లక్షన్నర, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున కేంద్రం ఇస్తున్నది. కానీ, గత బీఆర్ఎస్​ సర్కారు ఒక్కో డబుల్​ బెడ్​రూం ఇంటికి  పట్టణాల్లో సగటున రూ.8 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 లక్షలు వెచ్చించింది. ఈ లెక్కన గడిచిన ఎనిమిదేండ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.1,200 కోట్లతో 15 వేల ఇండ్లు పూర్తయ్యేవి. కానీ గత సర్కారు ఆ నిధులను ఇతర స్కీమ్​లకు మళ్లించడంతో ఆమాత్రం ఇండ్లు కూడా కట్టలేకపోయింది.  తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు  చేయాలని సీఎం రేవంత్ కోరడంతో ఎన్ని ఇండ్లు మంజూరవుతాయనే ఉత్కంఠ నెలకొన్నది. 

ఈసారి గైడ్​లైన్స్ మార్చిన రాష్ట్ర సర్కారు...
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ కింద నియోజకవర్గానికి  3,500 చొప్పున 4 లక్షల 50 వేల ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. తొలిదఫా సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని పేర్కొన్నది.  ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అప్లికేషన్లు తీసుకున్నది. కాగా పెద్దసంఖ్యలో ఇండ్లు నిర్మిస్తున్నందున గత ప్రభుత్వానికి భిన్నంగా పీఎం అవాస్ స్కీమ్ ను ఉపయోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు  నిబంధనలు అడ్డుగా ఉండడంతో వాటిని మారుస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 

 అందుకే గతానికి భిన్నంగా ఈసారి ఇందిరమ్మ ఇండ్ల కు ముందుగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నది. ఇవే లిస్టులను కేంద్రానికి పంపి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనుంది. కేంద్రం నుంచి  అర్బన్​లో ఒక్కో  ఇంటికి రూ.1.50 లక్షలు, రూరల్ లో రూ. 72 వేలు కేంద్రం నుంచి వస్తే మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.  కాగా, ప్రజాపాలనలో  రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల  కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్ల కోసం  అప్లికేషన్లు పెట్టుకోగా, ఆఫీసర్లు వీటిని మొదట 65 లక్షలకు  కుదించారు. తాజాగా ఆ అప్లికేషన్ల ద్వారా  రాష్ట్రవ్యాప్తంగా వెరిఫికేషన్​సర్వే నిర్వహించి, వీరిలో 30 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇండ్లు లేవని తేల్చారు.   గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 72 వేల మందికి ఇంటి మంజూరు పత్రాలు జారీ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies