పాపం జియో కస్టమర్లు ఇంత సీక్రెట్గా జియో ఇలా చేసిందేంటి కస్టమర్లకు కనీసం మాటైనా చెప్పకుండా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : టాతో పెద్దగా పనిలేని వాళ్లు ఇంట్లో, ఆఫీస్లో వైఫై అందుబాటులో ఉన్న జియో కస్టమర్లు ఈ ప్లాన్లతో ఇన్నాళ్లూ రీఛార్జ్ చేసుకున్నారు. 189 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటాతో అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్లతో అందుబాటులో ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్లు అమాంతం పెంచేశాక ఇదే చౌక ప్లాన్.
ఇక 479 రూపాయల రీఛార్జ్ ప్లాన్ విషయానికొస్తే ఇది కూడా దాదాపు ఇలాంటిదే. కాకపోతే.. 84 రోజుల వ్యాలిడిటీతో 6జీబీ డేటాతో, 1000 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్తో ఈ ప్లాన్ ఉండేది. 84 రోజుల వ్యాలిడిటీలో ఇదే చీపెస్ట్ ప్లాన్.
ఓన్లీ ఎస్ఎంఎస్, అపరిమిత వాయిస్ కాల్స్ ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ ఆదేశాలిచ్చిన సమయంలో రిలయన్స్ జియో ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లను సీక్రెట్గా ఎత్తేయడంపై కస్టమర్లు మండిపడుతున్నారు. డేటా అవసరం తక్కువగా ఉన్న కస్టమర్లు కూడా ఉంటారని, అలాంటి కస్టమర్లు డైలీ డేటా పొందే ఖరీదైన ప్లాన్లను కాకుండా 189 రూపాయలు, 479 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటారని కస్టమర్లు గుర్తుచేస్తున్నారు.
2జీ యూజర్ల కోసం జియో రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జియో 458 రూపాయలు, 1,958 రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్లను 2జీ యూజర్లకు అందుబాటులో ఉంచింది. 189, 479 ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు 458 రూపాయలు, 1,958 రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటారని జియో భావిస్తోంది.
458 రూపాయల జియో వాయిస్ ఓన్లీ ప్లాన్ బెన్ఫిట్స్:
* 84 రోజుల వ్యాలిడిటీ
* అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
* 1000 ఉచిత ఎస్ఎంఎస్లు
* 1,958 రూపాయల జియో వాయిస్ ఓన్లీ ప్లాన్ బెన్ఫిట్స్:
* 365 రోజుల వ్యాలిడిటీ
* అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
* 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు