Type Here to Get Search Results !

Sports Ad

నెల ముందుగానే మండే ఎండలు ఫిబ్రవరిలోనే దబిడి దిబిడే The Scorching Sun Earlier In The Month Is Intense In February Itself

 

నెల ముందుగానే మండే ఎండలు ఫిబ్రవరిలోనే దబిడి దిబిడే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గత మూడు నెలలుగా ప్రజలను గజగజ వణికించిన చలి కాలానికి ఎండ్ కార్డు పడే టైమ్ వచ్చింది. ప్రతి యేటా నవంబర్ నెలలో మొదలయ్యే వింటర్ సీజన్ ఫిబ్రవరితో ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజులు అయితే జనవరి ముగిసి ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. సాధారణంగా సంక్రాంతి పండుగ తర్వాత నుంచి చలి ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరి నాటికి పూర్తిగా వింటర్ సీజన్ ముగిసి మార్చి మొదటి నుంచి వేసవి కాలంలోకి ఎంట్రీ ఇస్తాం. 

 దాదాపు నాలుగు నెలల పాటు చలికి వణికిపోయిన ప్రజలు ఇక భానుడి ప్రతాపానికి భగ భగ మండిపోతారు.  రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ప్రతి యేటా ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రజలకు మరో ‘మండి’ పోయే వార్త చెప్పింది. ఈ ఏడాది ఒక నెల ముందుగానే అంటే ఫిబ్రవరి నుంచే ఎండలు దంచి కొట్టే అవకాశం ఉందని తెలిపింది.

 సహజంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో హైదరాబాద్ చాలా చాలా కూల్‎గా ఉంటుంది కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఒక నెల ముందుగానే ఎండలు మండిపోయే ఛాన్స్ ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. 

 హైదరాబాద్‎లో వాతావరణం అసాధారణంగా మారి ఫిబ్రవరి నుంచే ఎండలు దబిడి దిబిడి వాయించే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మధ్య తరగతి వారు కూలర్లు ఉన్నోళ్లు ఏసీ షాపులకు క్యూ కడుతున్నారు. 

>>> హైదరాబాద్ లో వాతావరణం అసాధారణంగా మారబోతున్నది.
>>> ఈసారి ఎండలు ముందే రాబోతున్నాయి.
>>> సహజంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో హైదరాబాద్ చాలా చాలా కూల్ గా ఉంటుంది.
>>> ఈసారి జనవరి నెలాఖరుకే చలి తీవ్రత తగ్గింది కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంటుంది. అంటే చలి చాలా చాలా తగ్గినట్లు.
>>> 2025, ఫిబ్రవరి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
>>> హైదరాబాద్ వాతావరణానికి మార్చి నెలాఖరు ఏప్రిల్ నెలలోనే 34 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.
>>> ఈసారి నెల ముందుగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies