ఆదివారం హైదరాబాద్ లో ముక్కా లేదు చుక్కా ఉండదు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఆదివారం వీక్ ఆఫ్ ఒక్కటే కాదు ఆ రోజు హైదరాబాదీలకు స్పెషల్ డే కూడా ఎందుకంటే ఆదివారం అంటే చాలు ఇంట్లో ముక్క ఉండాల్సిందే ముక్క ఉడకాల్సిందే ఆదివారం ఉదయం టీ షాపుల దగ్గర కంటే చికెన్, మటన్ షాపుల దగ్గర రద్దీ కామన్ అంతేనా ముక్కతోపాటు చుక్కా ఉండాల్సిందే కదా వీకెండ్ వారం అంతా కష్టపడి బ్రెయిన్ హీట్ అయిపోయి ఉంటుంది బుర్రను కొంచెం కూల్ చేసేందుకు బాధలను మర్చిపోయేందుకు నాలుగు పెగ్గులు వేయటం కామన్ రొటీన్.
అలాంటిది ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ లో డ్రై డే ముక్కా ఉండదు చుక్కా దొరకదు అవును నిజం ఎందుకంటారా రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీ ఆదివారం వచ్చింది. రిపబ్లిక్ డే రోజున మందు, మాంసం అమ్మటం నేరం వైన్ షాపులు మూసేస్తారు బార్లు క్లోజ్ అవుతాయి పబ్స్ తెరుచుకోవు అంతెందుకు ఆదివారం రోజు ఉదయాన్ని 5 గంటలకు తెరుచుకునే చికెన్, మటన్ షాపులు ఈ ఆదివారం మాత్రం షెట్టర్లు క్లోజ్ అన్నమాట.
76వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా రేపు ( జనవరి 26, 2025 ) తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి ఆదివారం పూట చుక్క, ముక్కతో ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుదామనుకున్నోళ్లకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.
ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు బంద్ ఉండనున్నాయి. అన్నీ పట్టణాల్లో కూడా ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా వరుసగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, ఎన్నికల ఫలితాల సందర్భంగా ఫిబ్రవరి 8న కూడా వైన్ షాపులు బంద్ కానున్నాయి.