Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల లిస్ట్ ఇదే This Is The list Of Villages Merged With Municipalities And Corporations In Telangana

తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల లిస్ట్ ఇదే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల వివరాలు పంపించాలని మున్సిపల్ కమిషనర్లు, గ్రామపంచాయతీల స్పెషల్ ఆఫీసర్లను కమిషనర్ అండ్​ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ కార్పొరేషన్ లో సిటీ శివారులో ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాలను కలిపింది. మంచిర్యాల కార్పొరేషన్ ను కొత్తగా ఏర్పాటు చేస్తూ అక్కడ  మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల విలీనంతో పాటు పలు గ్రామాలను కలిపారు. 

 వీటితో పాటు శంషాబాద్, నార్సింగి, నర్సంపేట, పరిగి మున్పిపాలిటీల్లో పలు గ్రామాలను ప్రభుత్వం విలీనం చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కోహిర్‌‌, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్‌‌, మహబూబాబాద్‌‌లో కేసముద్రం, జనగామ జిల్లాలో స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌, నారాయణపేటలో మద్దూరు, ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, భద్రాదికొత్తగూడెంలో అశ్వారావుపేట, మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో దేవరకద్ర, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మొయినాబాద్‌‌ కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి.

 అలాగే, ఇప్పటికే మున్సిపాలిటీలుగా ఉన్న వాటిలో అదనంగా మరికొన్ని గ్రామాలను విలీనం చేశారు. పరిగి మున్సిపాలిటీ పరిధిలో ఆరు గ్రామాలు, నర్సంపేట పరిధిలో ఏడు, నార్సింగ్‌‌లో జన్వాడ, శంషాబాద్‌‌లో శంకరాపురం, కరీంనగర్‌‌ పరిధిలో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు మరో ఆరు గ్రామాలను ప్రభుత్వం విలీనం చేసింది. వీటిని అసెంబ్లీ ఆమోదించడంతో పాటు ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపగా గెజిట్ రిలీజ్ చేశారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies