పేరెంట్స్కు షాక్ ప్రైవేట్ స్కూల్ ఫీజులు 30 శాతం పెంచారు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రతియేటా విద్యార్థుల ఫీజుల చెల్లింపులో పేరెంట్స్కి తిప్పలు తప్పడం లేదు.ఇష్టారాజ్యంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచడం..ఇదేంటని పేరెంట్స్ గొడవపడటం షరా మామూలే అవుతోంది. ఈ ఫీజుల విషయంలో ప్రైవేట్ పాఠశాలలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని పేరెంట్స్ చెబుతున్నారు. ప్రతి యేటా పెరుగుతున్న ఫీజులతో పిల్లల చదువులు భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.