Type Here to Get Search Results !

Sports Ad

డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు ఆకర్షణీయమైన జీతం దరఖాస్తు చేసుకోండి Apply For Bank Jobs Attractive Salary With Degree Qualification

డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు ఆకర్షణీయమైన జీతం దరఖాస్తు చేసుకోండి

జాతీయ National News భారత్ ప్రతినిధి : ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ బ్యాంకింగ్ కోసం జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ I (JMGS I) కింద ఈ భర్తీ చేపట్టనున్నారు. ఏదేని విభాగంలో డిగ్రీ అర్హత. ఆసక్తి గల అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్(centralbankofindia.co.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు.

* మొత్తం ఖాళీలు: 1,000
* జనరల్: 405 పోస్టులు
* OBC: 270 పోస్టులు
* ఎస్సీ: 150 పోస్టులు
* ఎస్టీ: 75 పోస్టులు
* EWS: 100 పోస్టులు

విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని విభాగంలో డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. దాంతో, పాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు SC/ ST/ OBC/ PwBD అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు.

దరఖాస్తు ఫీజు: SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు రూ.150. ఇతర అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌...
* ఎంపిక ప్రక్రియ
* వ్రాత పరీక్ష
* వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఎంపికైన అభ్యర్థులు బ్యాంకులో పూర్తి స్థాయి ఉద్యోగులుగా చేరడానికి ముందు బ్యాంకింగ్ & ఫైనాన్స్ (PGDBF)లో ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేయాలి.

* జీతం: ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 48,480 నుండి రూ. 85,920 వరకు జీతం అందుకుంటారు.

* దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 30, 2025
* దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies