మొబైల్ బానిసలుగా ఇండియన్స్ రాత్రీపగలూ లేకుండా సెల్ఫోన్లోనే
Health News భారత్ ప్రతినిధి : ఇటీవల కాలంలో సెల్ఫోన్ వినియోగం అనేది ఓ వ్యసనంలా మారింది. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వినియోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సెల్ ఫోన్ ఆపరే ట్ చేస్తున్నారు. మెసేజ్ లు, వీడియా కాల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో సెర్చింగ్ చేస్తూ గంటల కొద్దీ సమయం గడుపుతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదం అంటున్నాయి సర్వే రిపోర్టులు. ప్రపంచ దేశాలకంటే మన దేశంలోని ప్రజలు స్క్రీన్ పై ఎక్కువ సమయం గడుపుతున్నారట.
సెన్సార్ టవర్స్ రిపోర్టు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ స్క్రీన్ వినియోగంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. రెండో దేశంలో ఇండోనేషియా ఉంది. మొబైల్ ఫోన్లు, ఇతర స్క్రీన్లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు మన భారతీయులు. రిపోర్టుల ప్రకారం దాదాపు 1.12 ట్రిలియన్ల గంటల స్క్రీన్లపై గడిపారు. 771.5 బిలియన్ల గంటలతో మన తర్వాత ఇండోనేషియా ప్రజలు ఉన్నారు. ఇది దేశంలో సెల్ ఫోన్ వ్యసనం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక 2024లో మన దేశంలో స్క్రీన్ వినియోగం 13 శాతం పెరిగింది. అదే అమెరికాలో అయితే బాగా తగ్గింది అమెరికా ప్రజలు సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ల వంటి ఇతర స్క్రీన్ వినియోగం బాగా తగ్గించారు. 2024లో 0.6 శాతం అమెరికన్ల స్క్రీన్ వినియోగం తగ్గింది.
మనోళ్లు ఎక్కువగా సోషల్ మీడియా సర్ఫింగ్ లో గడుపుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. దాదాపు 743.10 బిలియన్ల గంటలు సోషల్ మీడియాలో గడిపారని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ వినియోగంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 1నుంచి 2 యేళ్ల లోపు పిల్లలు బాగా స్క్రీన్లకు గురవుతున్నారని తేలింది. చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం అనేది పెద్ద చేతిలో ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
మరోవైపు పెద్దలు కూడా ఆకర్షణీయమైన యాప్ ల డిజైన్లు ఇతర ఆకర్షణలతో కస్టమర్లు బానిసలవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని యాప్‌లపై అంతర్నిర్మిత నియంత్రణలు ఉన్నప్పటికీ భారతదేశంలో 60 శాతం మంది ఇప్పటికీ డిజిటల్ నిరక్షరాస్యులే అని నిపుణులు అంటున్నారు.