Type Here to Get Search Results !

Sports Ad

ఆర్టీసీ బస్సు కింద నలిగిన పసి ప్రాణం వికారాబాద్​ జిల్లా బషీరాబాద్​లో ఘటన A Boy's Life Was Crushed Under An RTC Bus In Basheerabad Of Vikarabad District

ఆర్టీసీ బస్సు కింద నలిగిన పసి ప్రాణం వికారాబాద్​ జిల్లా బషీరాబాద్​లో ఘటన

బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడేండ్ల బాలుడు బలయ్యాడు. వికారాబాద్​ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని టాకీ తండాకు చెందిన రాథోడ్ వెంకటేష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని షోషిస్తున్నాడు. ఆయన కొడుకు శ్రీరామ్ (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.

బుధవారం పాఠశాలలో ఆడుకుంటూ రోడ్డు దాటుతుండగా, తాండూర్ నుంచి క్యాద్గిరా వెళ్తున్న ఆర్టీసీ (అద్దె) బస్సు బాలుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్ కిందపడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

డ్రైవర్‌‌‌‌ నిర్లక్ష్యంగా బస్సును నడిపి తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బస్సు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies