Type Here to Get Search Results !

Sports Ad

నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి చర్మానికి నిగనిగ గ్యారంటీ Four Flour Should Be Prepared Like This To Guarantee A Shiny Skin

నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి చర్మానికి నిగనిగ గ్యారంటీ

Health News భారత్ ప్రతినిధి : మన చినన్నప్పుడు నలుగు పెట్టి స్నానం చేయించే వారు.  ఇప్పుడంటే అనేక రకాలైన సోపులు బాడీలోషన్​లు వచ్చాయనుకోండి.  వెనుకటి కాలంలో హీరోయిన్లు కూడా నలుగు పిండితో స్నానం చేసేవారు.  అందుకే వారు మేకప్​ లేకపోయినా అందంగా మెరిసి పోయేవారు.  అయితే ఇప్పటి జనరేషన్​ వారు  నలుగుపిండి స్నానం అనంగనే మోటుపద్ధతి అనుకుంటరు . కానీ  దానివల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో సరిగ్గా తెలుసుకుంటే వందలు ఖర్చుపెట్టి కెమికల్స్ కొనరు. ఒక్కసారి నలుగుపిండితో స్నానం చేసి చూడండి. రిజెల్ట్ మీకే అర్థమవుతుంది. 

నలుగు పిండి ఎలా తయారు చేయాలంటే... 
బియ్యపు పిండి, శెనగపిండి గరుకుగా పొడి చేసి కలపాలి. ఈ పొడిలో నువ్వులనూనె కలపాలి. నలుగు పిండి మరీ తడిగా ఉండకూడదు. ఒంటికి పట్టించి, రివర్స్ యాంగిల్ లో మర్దనా చేయాలి. దీనివల్ల ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. 

 చివర్లో కొంచెం నువ్వుల నూనె చర్మానికి రాయాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఒంటికి నలుగుపిండి పెట్టుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. కావాలంటే పసుపు, ఆవపిండి, ఉలవ పిండి, గంధం, మారేడు పత్రాల పొడులను ఉపయోగించి కూడా నలుగు పెట్టుకోవచ్చు.  మరి ఇలా నలుగు పిండిని తయారు చేసుకొని బాడీని కెమికల్స్​ నుంచి కాపాడుకుంటూ అదరహో అందం అంటూ ఎంజాయి చేయండి..

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies