జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది
జాతీయ National News భారత్ ప్రతినిధి : జియోపై 189 రూపాయల ప్లాన్ ఎత్తేసినందుకు విమర్శలు రావడానికి కారణాలు లేకపోలేదు. డేటా పెద్దగా అవసరం లేని కస్టమర్లు, కేవలం యూపీఐ ట్రాన్షాక్షన్ల కోసం మాత్రమే డేటాను ఉపయోగించుకునే కస్టమర్లు, ఇంట్లో ఆఫీస్లో వైఫై సదుపాయం ఉన్న కస్టమర్లు కూడా యూజర్లలో ఉంటారు. అలాంటి కస్టమర్లు నెలకు 2 జీబీ డేటా వచ్చినా సరిపెట్టుకుంటూ, పొదుపుగా వినియోగించుకుంటూ 189 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుని రీఛార్జ్ భారాన్ని కొంతైనా తగ్గించుకుంటూ ఉంటారు.
189 రూపాయల ప్లాన్ బెన్ఫిట్స్ ఇవి...
* ప్యాక్ వ్యాలిడిటీ-28 రోజులు
* టోటల్ హై స్పీడ్ డేటా-2జీబీ
* అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* 300 ఉచిత ఎస్ఎంఎస్లు
అలాంటి వాళ్లకు 189 రూపాయల ప్లాన్ లో అందుబాటులో లేకుండా చేసి, 84 రోజుల, 336 రోజుల వాయిస్ ఓన్లీ ప్లాన్లను మాత్రమే అందుబాటులో ఉంచడంపై జియోపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జియో అత్యాశకు అంతూపొంతూ లేకుండా పోతుందని కొందరు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపడేశారు. కస్టమర్ల ఫీడ్ బ్యాక్తో ఠారెత్తిపోయిన జియో మొదటికే మోసం వచ్చేలా ఉందని మళ్లీ 189 రూపాయల రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. జియో తీసుకొచ్చిన వాయిస్ ఓన్లీ ప్లాన్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
448 రూపాయల జియో వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ డీటైల్స్...
* ప్యాక్ వ్యాలిడిటీ-84 రోజులు
* డేటా-నిల్
* అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* 1000 ఉచిత ఎస్ఎంఎస్లు
1748 రూపాయల జియో వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ డీటైల్స్...
* ప్యాక్ వ్యాలిడిటీ-336 రోజులు
* డేటా-నిల్
* అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* 3600 ఉచిత ఎస్ఎంఎస్లు