కుంభమేళాలో మోదీ పవిత్రస్నానం త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రయాగ్ రాజ్ లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కుంభమేళాలో ప్రధాని మోది ఫిబ్రవరి 5 వ తేదీన పుణ్యస్నానమాచరించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో బుధవారం మోది త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు. మోదీ స్నానం చేసే సమయంలో కాషాయ వస్త్రాలు రుద్రాక్ష మాలను ధరించారు. ఘాట్‌లో ఒక్కరే మోదీ స్నానమాచరించారు. భీష్మాష్టమి రోజున మోదీ కుంభమేళాకు వచ్చారు.
ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకున్న మోది.అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు వెళ్లారు. సంగమం వరకు పడవలో చేరుకున్నారు. మోదీతో పాటు యూపీ సీఎం యోగి కూడా ఉన్నారు, మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంకు వెళ్లి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.